ఉపాధ్యాయుడికి పోలీసు అధికారి బెదిరింపులు !

Telugu Lo Computer
0


బీహార్‌ లోని ఓ పోలీస్‌స్టేషన్‌లో తన సమస్యను వెల్లడించుకోవడానికి వచ్చిన ఓ ఉపాధ్యాయుడి పట్ల ఓ పోలీసు అధికారి అనుచితంగా ప్రవర్తించిన ఘటన  చోటు చేసుకుంది. చెప్పిన సమయానికి కాకుండా ఆలస్యంగా వచ్చాడని ఆగ్రహానికి గురైన ఆ పోలీసు అధికారి బాధితుడిపై దుర్భాషలాడాడు. అంతేకాక అధికారాన్ని అడ్డుపెట్టుకొని క్షణాల్లో నిన్ను ఉగ్రవాదిగా ప్రకటించగలనని బెదిరింపులకు పాల్పడ్డాడు. సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో విషయం వెలుగు చూసింది. ఓ వివాదానికి సంబంధించి తన సమస్యను విన్నవించుకోవడానికి ఓ ఉపాధ్యాయుడు తన కుటుంబసభ్యులతో పాట్నాలోని ఉన్న జాముయి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. చెప్పిన సమయానికి కాకుండా మూడు రోజులు ఆలస్యంగా వచ్చాడని ఆగ్రహించిన పోలీసు అధికారి రాజేశ్‌ శరన్‌ బాధితుడి సమస్యను పట్టించుకోకుండా ఇతరుల పేర్లు పిలవడం ప్రారంభించాడు. ఆ ఉపాధ్యాయుడు తన ఆలస్యానికి కారణాలను వెల్లడించినా వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోమన్నాడు. వెళ్లకపోతే ''క్షణాల్లో నిన్ను ఉగ్రవాదిగా ప్రకటించగలను'' అని అతడిని బెదిరించాడు. ఆ అధికారి తన సీటులో నుంచి లేచి ఉపాధ్యాయుడిని బెదిరిస్తున్నట్లు వీడియోలో ఉంది. విషయం వెలుగు చూడటంతో సంఘటనపై విచారణ జరపాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)