కుక్క, పాము భయంకర పోరు !

Telugu Lo Computer
0

 


తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఓటాయి గ్రామంలో రాగం యాకయ్య తన ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తున్నారు. అదే సమయంలో పెరడు నుంచి ఇంట్లోకి వస్తున్న నల్ల తాచు పామును పెంపుడు కుక్క గమనించింది. ఆ పామును అడ్డుకునేందుకు అరుస్తూ దాని ఎదుటకు వెళ్లింది. పాము లెక్కచేయకుండా ముందుకు వస్తుండటంతో పోరు షురూ చేసింది. ఈ కుక్కకు మరో కుక్క కూడా తోడయింది. అయినప్పటికీ అదొక్కటే భీకర పోరాటం సాగించింది. పాము, కుక్క చాలా సేపు పోరాడాయి. పాము కాటు నుంచి తప్పించుకుంటూ తన పదునైన పళ్లతో పామును కొరికేసింది. దాంతో పాము ప్రాణాలు విడిచింది. కుక్క తనను, తన యజమాని కుటుంబాన్ని కాపాడింది. ఈ రెండిటి మధ్య పోరాటాన్ని ఇంటి సభ్యులు, గ్రామస్తులు ఆసక్తిగా చూశారు. తమ ఫోన్ కెమెరాల్లో వీడియో రికార్డ్ చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అదికాస్తా వైరల్ అయ్యింది. కుక్క పోరాటాన్ని చూసి నెటిజన్లు సైతం అవాక్కవుతున్నారు. విశ్వాసంలో కుక్కను మరేదీ మించదని కామెంట్స్ పెడుతున్నారు. తన యజమాని కుటుంబం కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టిన కుక్కను చూసి నెటిజన్లు వావ్ అంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)