భజరంగ్ దళ్'ను బ్యాన్ చేస్తామనలేదు !

Telugu Lo Computer
0


ఇస్లామిక్ సంస్థ అయిన పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)తో పాటు హిందూ సంస్థ అయిన భజరంగ్ దళ్ ను రద్దు చేస్తామంటూ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో చేర్చడం తీవ్ర వివాదాస్పదమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీన్ని తనదైన శైలిలో తిప్పికొట్టారు. భజరంగ్ దళ్ ని నిషేధిస్తారా అంటూ దుమ్మెత్తి పోశారు. అంతే కాకుండా, ఆయన పాల్గొన్న బహిరంగ సభల్లో ప్రజల చేత భజరంగ్ దళ్ నినాదాలు చేయిస్తూ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతను తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. తాము భజరంగ్ దళ్ ను రద్దు చేస్తామని చెప్పలేదని, అలాంటిది తమ పార్టీ మేనిఫెస్టోలోనే లేదంటూ కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీ వివరణ ఇచ్చారు. గురువారం ఆయన ఉడిపిలో మీడియాతో మాట్లాడుతూ  “మేము మా మ్యానిఫెస్టోలో పీఎఫ్ఐ, భజరంగ్ దళ్ లను ప్రస్తావించాము. ఈ రెండింటినే కాకుండా ఇందులో అన్ని రాడికల్ సంస్థల్ని ప్రస్తావించాము. ఏ ఒక్కరి మీదో చర్య తీసుకుని మిగిలిన వారికి వదిలేయడం అనేది సాధ్యం కాదు. భజరంగ్ దళ్ ను కర్ణాటక ప్రభుత్వం నిషేధించదు” అని మొయిలీ అన్నారు. ఈ విషయం మీద శివకుమార్ మరింత క్లారిటీ ఇస్తారని ఆయన అన్నారు. విద్వేష రాజకీయాలకు స్వస్తి చెప్పాలని సుప్రీంకోర్టు కూడా తీర్పునిచ్చిందని, భజరంగ్ దళ్ ను నిషేధించే ప్రతిపాదన తమ వద్ద లేదని అన్నారు. మెజారిటీ లేదా మైనారిటీ వర్గాల మధ్య శత్రుత్వం లేదా ద్వేషాన్ని వ్యాప్తి చేసే వ్యక్తులు, సంస్థలపై కఠినమైన నిర్ణయాత్మక చర్య తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని మేనిఫెస్టో పేర్కొందని ఆయన గుర్తు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)