జూన్ 2 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి పరీక్షా ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ రోజు విజయవాడలో విడుదల చేశారు.ఈ ఏడాది కూడా బాలికలు బాలురపై పై చేయి సాధించారు. ఉత్తీర్ణులయిన విద్యార్థులకు మంత్రి బొత్సా అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో 933 పాఠశాలల్లో వంద శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 38 పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం సున్నగా నమోదయింది. పార్వతీపురం మన్యం జిల్లా 87.47 శాతంతో ఫస్ట్ ప్లేస్ లో నిలవగా, 60.39 శాతం ఉత్తీర్ణతతో నంద్యాల జిల్లా లాస్ట్ ప్లేస్ లో నిలిచింది. ఏపీ రెసిడెన్షియల్‌ పాఠశాల్లో అత్యధికంగా 95.25 శాతం ఉత్తీర్ణత నమోదు అయింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,05,052 మంది పరీక్షలకు హాజరు కాగా.. బాలురు 3,09,245, బాలికలు 2,95,807 మంది హాజరైన వారిలో ఉన్నారు. ఈ ఏడాది మొత్తం 72. 26 శాతం మంది స్టూడెంట్స్ ఉత్తీర్ణత సాధించారు. బాలుర ఉత్తీర్ణత కంటే బాలికల ఉత్తీర్ణత శాతం 6 శాతం అధికంగా ఉంది. ఫెయిలైన విద్యార్థులు తమ విద్యాసంవత్సరం కోల్పోకుండా వెంటనే అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నామని మంత్రి బొత్స చెప్పారు. ఇప్పటికే ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించారు. ఫెయిలైన విద్యార్థులకు జూన్‌ 2వ తేదీ నుంచి 10 వరకు పరీక్షలను నిర్వహించాహ్నున్నారు. దీనికి సంబంధంచిన పరీక్షల షెడ్యూల్‌ ను త్వరలో ప్రకటించనున్నామని పేర్కొన్నారు. ఈ పరీక్షల కోసం విద్యార్థులు దరఖాస్తులను ఈ నెల 17 లోపు చేసుకోవాలని.. పరీక్ష ఫీజు చెల్లించాలని తెలిపారు. లేట్ ఫీ రూ.50 లతో మే 22 వరకూ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు అని అన్నారు. అదే విధంగా రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ కోసం స్టూడెంట్స్ ఈ నెల 13వ తేదీ లోగా ఫీజు చెల్లించాలని మంత్రి సూచించారు. నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించిన స్కూల్స్ కు, అత్యధిక శాతం మార్కులు సాధించిన స్టూడెంట్స్ కు , ఆ స్కూల్ టీచర్స్ ను పోత్సహించే విధంగా ప్రణాళికలను ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. స్టూడెంట్స్ ఎటువంటి అఘాయిత్యాలు పాల్పడవద్దని, పరీక్షలో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కు స్పెషల్ కోచింగ్ ఇప్పిస్తామని మంత్రి బొత్సా పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా కొన్ని పాఠశాలలను గుర్తించామని, ఈ స్కూల్స్ లో స్టూడెంట్స్ కు ప్రత్యేక తరగతులు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు. విద్యా అకడమిక్ సంవత్సరం వెస్ట్ కాకుండా అడ్వాన్స్‌ సప్లిమెంటరీ ఫలితాలను కూడా త్వరగా ప్రకటిస్తామని మంత్రి బొత్స వివరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)