28% అధిక వర్షపాతం !

Telugu Lo Computer
0


దేశంలోని పలు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. సాధారణంగా వేసవి కాలంలో నమోదు అయ్యే వర్షాల కన్నా ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదు అయినట్లు భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) వెల్లడించింది. మార్చి 1 నుంచి మే 3 వరకు సాధారణం కన్నా 28 శాతం అధికంగా వర్షపాతం నమోదు అయిందని తెలిపింది. ఇదిలా ఉంటే తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో మాత్రం లోటు వర్షపాతం నమోదు అయింది. ఈ ప్రాంతాల్లో 29 శాతం తక్కువగా వర్షాలు కురిశాయి. దక్షిణాదిలో 88 శాతం, మధ్య భారతదేశంలో 18.2 శాతం, పంజాబ్, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలతో కూడిన వాయువ్య భారతదేశంలో 18 శాతం మేర అధికంగా వానలు కరిశాయని తెలిపింది. ఏప్రిల్ 21-22 నుంచి చాలా చోట్ల వర్షాలు అధికంగా కురిసినట్లు చెప్పింది. వర్షాల వల్ల సాధారణం కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని వెల్లడించింది. గత నెల 21 నుంచి దేశంలో ఎక్కడా వడగాలులు సంభవించలేదని చెప్పింది. ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో తుఫాన్ గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ఒడిశాతో పాటు పటు కోస్తా ప్రాంతాలు అప్రమత్తం అయ్యాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)