తుఫాన్‌గా మారిన అల్పపీడనం

Telugu Lo Computer
0


ఉత్తర బంగాళాఖాతం అండమాన్‌ దీవిలో ఏర్పడిన అల్పపీడనం పెను తుఫానుగా మారనుంది. దీని ప్రభావంతో ఈనెల 6 నుంచి 9 వరకు దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురువనున్నట్లు భారత వాతావరణ అధ్యయన కేంద్రం అధికారులు తెలిపారు. తాజా సమాచారం అందే సమయానికి గోపాల్‌పూర్‌ తీరానికి 700కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉంది. మూడు రోజుల క్రితం బంగాళాఖతంలో ఏర్పడిన అల్పపీడనం సైక్లోన్‌గా మారినట్లు వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీని ప్రభావంతో తుఫాను తీరందాటే సమయంలో భారీ వర్షంతో పాటు గంటకు సుమారు 80నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. అలాగే గంజాం, గజపతి, రాయగడ, ఖుర్దా, జగత్సింగపూర్‌, పారాదీప్‌ జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర లోని శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం తీరప్రాంతాల్లో భారీ నష్టం జరిగే ప్రమాదం ఉన్నట్లు సమాచారం. మరోవైపు గంజాం జిల్లా ఛత్రపూర్‌లో కలెక్టర్‌ దివ్యజ్వోతి పరిడా వివిధ విభాగాలకు చెందిన ప్రభుత్వ అధికార్లతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. సాధ్యమైనంత వరకు తుఫాన్‌ ప్రభావంతో ప్రాణ, ఆస్తినష్టం లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)