అమ్మాయిల సమాధులకు తాళాలు ?

Telugu Lo Computer
0


పాకిస్తాన్ లో తమ కూతుర్ల సమాధులకు తల్లిదండ్రులు తాళాలు వేస్తున్నారు. సమాధిని తవ్వి లేదా శవాన్ని టచ్ చేసే ఛాన్స్ లేకుండా  బలమైన ఇనుప ఊచలతో తాళాలు వేస్తున్నారు. ఇది నిజంగా షాకింగ్ విషయమే. ఇలా ఎక్కడా, ఎవ్వరూ చేసి ఉండరు. కానీ కరువు ప్రాంతంలా మారిన పాకిస్తాన్ లో ఇలా చేస్తున్నారు. కారణం ఏంటంటే.. ఈమధ్య అక్కడ అత్యాచారాలు బాగా పెరిగిపోయాయి. అక్కడ ప్రతీ 2 గంటలకు ఓ మహిళపై రేప్ జరుగుతోంది. కొందరు దుర్మార్గులు శవాలతో ఫిజికల్ కాంటాక్ట్ పెట్టుకుంటున్నారు. దీన్నే నెక్రోఫిలియా అంటారు. ఇలాంటి చర్యలకు పాల్పడేవారికి శవాలు నచ్చుతాయి. సమాధులను పగలగొట్టి మరీ శవాల్ని ఎత్తుకుపోతారు. సెక్సువల్ ఇంటర్‌కోర్స్‌కి పాల్పడతారు. ఇదే ఇప్పుడు ఆ దేశాన్ని కుదిపేస్తోంది. చాలా చోట్ల మహిళలు, యువతుల శవాలు మాయమవుతున్నాయి. కొన్నిచోట్ల శవాలపై అత్యాచారం జరిగినట్లు ఆధారాలు లభిస్తున్నాయి. మన దేశంలో లాగానే పాకిస్తాన్ లో కూడా కుటుంబ విలువలు అత్యున్నతంగా ఉంటాయి. మహిళలకే కాదు, వారి శవాలకు ఏం తప్పు జరిగినా ఆ దేవుడు తమను క్షమించడనీ ఆ శాపం వెంటాడుతుందని నమ్ముతారు. అలాంటి దేశంలో మహిళలకే కాదు.. శవాలకూ భద్రత లేదని ఇప్పుడు స్పష్టమవుతోంది. పాకిస్తాన్ ఇలాంటి లైంగిక వాంఛలు, నిరాశతో కూడిన సమాజాన్ని సృష్టించింది. ప్రజలు ఇప్పుడు వారి కుమార్తెలు అత్యాచారానికి గురికాకుండా వారి సమాధులకు తాళాలు వేస్తున్నారు. మీరు బురఖాను రేప్‌తో లింక్ చేసినప్పుడు, అది మిమ్మల్ని సమాధి వరకు అనుసరిస్తుంది" అని బుధవారం ట్విట్టర్ యూజర్.. సుల్తాన్ ట్వీట్ చేశారు. పాకిస్తాన్ లో నెక్రోఫీలియాని ఆపే పరిస్థితి కనిపించట్లేదు. ఎప్పుడు, ఎక్కడ, ఏ అమ్మాయి సమాధి మాయమవుతుందో తెలియని పరిస్థితి. శవాలను కాపాడుకోవడం తప్ప వేరే గత్యంతరం లేని స్థితిలో పేరెంట్స్ ఉన్నారు. పాకిస్తాన్ సృష్టించిన సామాజిక వాతావరణం, లైంగిక వేధింపులు, అణచివేతకు గురైన సమాజానికి దారితీసింది. ఇక్కడ కొంతమంది వ్యక్తులు తమ కుమార్తెలను లైంగిక హింస నుంచి రక్షించడానికి వారి సమాధులకు తాళాలు వేస్తున్నారు. నిరాశతో నిండిన వారు... ఇలాంటి మార్గాన్ని అనుసరిస్తున్నారు. ఇది శోకానికి దారితీస్తుంది" అని మరో యూజర్ సాజిద్ యూసఫ్ షా ట్వీట్ చేశారు. 2011లో ఓ భయంకరమైన నెక్రోఫిలియా కేసు బయటపడింది. కరాచిలోని నార్త్ నాజిమాబాద్‌గకి చెందిన మహ్మద్ రిజ్వాన్..శ్మశాన కాపరిగా ఉంటూ 48 మహిళా శవాలను రేప్ చేసినట్లు తేలడంతో అతన్ని అరెస్టు చేశారు. జాతీయ మానవ హక్కుల సంఘం ప్రకారం 40 శాతం మంది మహిళలు ఏదో ఒక రకమైన లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)