మోడీ ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య ఫేకా ?

Telugu Lo Computer
0


ప్రధాని మోడీ ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్యపై ఓ కొత్త సందేహం తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే ముగ్గురు అగ్రనేతల్లో ప్రధాని మోడీ ఒకరు. ఆయన ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య 87 మిలియన్లు అంటే దాదాపు 7 కోట్ల మంది. ఇక దేశంలో ట్విట్టర్ వినయోగదారుల సంఖ్య 2.36 కోట్లు. అంటే దేశంలో ట్విట్టర్ ఫాలో అయ్యేవారి సంఖ్య కంటే మోడీని ఫాలో అయ్యే వారు దాదాపు 5 కోట్ల మంది అధికం. అంటే ప్రధాని మోడీ ఫాలోవర్లలో 5 కోట్ల మంది విదేశీయులు కూడా ఉన్నారా అని అనుమానం ప్రస్తుతం కలుగుతోంది. అంతటి ప్రజాభిమానం ఉన్న నేతను భారతీయులే గుర్తించలేకపోయారా ? లేదంటే వారికి టెక్నాలజీ, సోషల్ మీడియా గురించి తెలియక ఫాలో అవ్వలేకపోతున్నారా అని కొత్త డౌట్లు మొదలయ్యాయి. ఈ విషయంపై గతంలో ప్రముఖ వ్యాపారవేత్త, ఎస్‌కే రెస్టారెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మాజీ సీఈవో రాజీవ్‌ మట్ట కూడా ట్విట్టర్ వేదికగా పలు ప్రశ్నలు లేవనెత్తారు. దేశంలో ఉన్న ట్విట్టర్ ఫాలోవర్లంతా మోడీని ఫాలో అయినా మిగిలిన 5.4 కోట్ల మంది ఎక్కడి నుంచి వచ్చినట్టని ప్రశ్నించారు. వారంతా విదేశాల్లోనే ఉంటున్నారా? అని అడిగారు. మరో పక్క మోడీ  ఫాలోవర్లలో 60 శాతం మంది నకిలీయే అని పోప్ ఫ్రావిన్స్‌కు చెందిన ఓ నివేదిక గతంలో వెల్లడించింది. దీన్ని బట్టి చూస్తే ఫాలో అయ్యే వారిలో పార్టీకి చెందిన వారే నకిలీ ప్రోఫైల్స్‌తో మోడీని ఫాలో అవుతున్నారేమో అనిపిస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)