ఐసీయూలో చలాకీ చంటి !

Telugu Lo Computer
0


జబర్దస్త్‌ ఫేమ్‌ చలాకీ చంటి గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నెల 21న చంటికి తీవ్రమైన ఛాతీనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు గుండెపోటుగా గుర్తించారు. వెంటనే ఐసీయూకు తరలించి చికిత్స అందించారు. రక్తనాళాల్లో పూడికలు ఉన్నట్లు తేలడంతో డాక్టర్లు స్టంట్‌ వేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఓ వార్త బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని వైద్యులు వెల్లడించినట్లు తెలుస్తోంది. చంటి ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ఇంతవరకు ఎక్కడా స్పందించనేలేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)