తృణధాన్యాలతో అల్పాహారం !

Telugu Lo Computer
0


పిల్లలకు అల్పాహారంగా తృణధాన్యాలతో టిఫిన్లు ప్రయత్నిస్తే రుచితోపాటు పోషకాలూ అందుతాయంటున్నారు నిపుణులు. సజ్జ పిండిలో, పెరుగు, తాజా కూరగాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసి బాగా కలిపిన పిండితో ఊతప్పం, పునుగులు వేసుకోవచ్చు. గ్రీన్‌ చట్నీతో తింటే చాలా బాగుంటుంది. కావల్సినన్ని పోషకాలూ అందుతాయి. జొన్నల్లో  ఫైబర్‌, ప్రొటీన్లు అధికం. దీన్ని రవ్వ పట్టిస్తే, ఉప్మా చేసుకొని కొబ్బరి చట్నీతో తినొచ్చు. గ్లూటెన్‌ రహిత పోషకాలు ఆరోగ్యంతో పాటు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అరికెల్లో క్యాల్షియం ఎక్కువ. కీళ్లనొప్పులు ఉన్న వారు క్రమం తప్పక తీసుకుంటే మంచి ఔషధం లాగా పని చేస్తాయి. అరికెల్లో కొద్దిగా మెంతులు, మినపప్పు వేసి రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే దోశలు వేసుకుంటే సరి. రాగులుతో ఇడ్లీ, దోశ తెలిసిన విషయమే. ఇప్పుడు రాగుల సేమ్యా అమ్ముతున్నారు. దాంతో సాధారణ సేమ్యాతో ఉప్మా చేసుకున్నట్టే తేలికగా చేసుకోవచ్చు. దీంట్లో ఇనుము, క్యాల్షియం, ఫైబర్‌ అధికం. రక్తహీనతను కూడా దూరం చేస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)