సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం : గౌతమ్ అదానీ

Telugu Lo Computer
0


హిండెన్ బర్గ్ నివేదిక నేపథ్యంలో అదానీ షేర్ల పతనంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తెలిపారు. అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ తమ గ్రూపుపై చేసిన ఆరోపణలన్నింటినీ అదానీ కొట్టిపారేశారు. ఏదో ఒక రోజు నిజం బయటపడుతుందని చెప్పారు. గౌరవనీయమైన సుప్రీంకోర్టు ఆదేశాలను అదానీ గ్రూప్ స్వాగతించిందని, ఇది తగిన సమయంలో వాస్తవాలను బయటపెడుతుందని, అంతిమంగా సత్యమే గెలుస్తుందని అని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే అదానీ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే గతంలో గౌతం అదానీ గతంలోనూ హిండెన్‌బర్గ్ నివేదికను ఖండించారు. తమ గ్రూప్ స్టాక్ ల నష్టంతో హిండెన్ బర్గ్ లాభపడతారని తెలిపారు. హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలపై గ్రూపు 413 పేజీల సుదీర్ఘ వివరణ కూడా విడుదల చేసింది. అదానీ-హిండెన్‌బర్గ్ కేసుపై దాఖలైన పిల్ లను విచారించిన సుప్రీంకోర్టు.. మార్కెట్ నిబంధనలను ఉల్లంఘించినట్లయితే , స్టాక్ మానిప్యులేషన్ జరిగిందా అని నిర్ధారించడానికి దర్యాప్తు చేయాలని మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి)ని ఇవాళ ఆదేశించింది.సెబీ రెండు నెలల్లో నివేదిక అందించాలని ఆదేశాలు ఇచ్చింది.

Post a Comment

0Comments

Post a Comment (0)