ఆస్ట్రేలియాకు స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించిన భారత్

Telugu Lo Computer
0


ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్ లో భాగంగా మూడో టెస్టులో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 163 పరుగులకు ఆలౌట్ అయి  ఆసీస్ కు 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని  నిర్దేశించింది. ఆసీస్ బౌలర్ నాథన్ లయాన్ ఎనిమిది వికెట్లు తీయడంతో భారత బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు ఛటేశ్వర్ పూజారా ఓపికగా ఆడాడు. హాఫ్ సెంచరీ(59)తో టీమిండియా పరువు నిలబెట్టాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 109కు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. తర్వాత బ్యాంటిగ్‌ చేసిన ఆసీస్ 197 పరుగులు మాత్రమే చేసింది. రవీంద్ర జడేజా (4), రవిచంద్రన్ అశ్వీన్(3), ఉమేశ్ యాదవ్ (3) చెలరేగడంతో ఆసీస్ ను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. ఆసీస్ స్పిన్ బౌలర్ లయాన్ బౌలింగ్‌లో 13సార్లు ఔటైన పూజారా.. ఎక్కువసార్లు ఔటైన భారత బ్యాటర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఆ తర్వాత స్థానంలో రహానే (10), రోహిత్ శర్మ (8), కోహ్లీ (7) ఉన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)