బాల్యంలో న్యుమోనియా - అనర్ధాలు !

Telugu Lo Computer
0


న్యుమోనియా అన్నది ఊపిరితిత్తులను తీవ్రంగా ప్రభావితం చేసే శ్వాసకోశ వ్యాధి . దగ్గుతుండడం, శ్వాస ఆడకపోవడం, జ్వరం, చలి లేదా వణుకు, వాంతులు, తలనొప్పి, తినాలని కోరిక లేక పోవడం , ఛాతీ లేదా కడుపు నొప్పి, వంటి సమస్యలు వస్తే న్యుమోనియా లక్షణాలని గుర్తించవలసి వస్తుంది. న్యుమోనియాను గుర్తించడానికి ఊపిరితిత్తుల్లో ద్రవం ఉందా లేదా అనేది ముందుగా తనిఖీ చేస్తారు. ఎక్కువగా ఛాతీ ఎక్స్‌రే ద్వారా న్యుమోనియా గుర్తిస్తారు. ఇది కాకుండా రక్త పరీక్ష ద్వారా కూడా దీన్ని గుర్తిస్తారు. ఇటువంటి న్యుమోనియా బాల్యంలో వస్తే వారు పెద్దయ్యాక 26-73 సంవత్సరాల వయసులో శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ వచ్చినట్టయితే అకాల మరణం సంభవించే రిస్కు ఎక్కువగా ఉంటుందని ది లాన్సెట్ జర్నల్‌లో వెలువడిన అధ్యయనం హెచ్చరించింది. సాధారణంగా శ్వాసకోశ వ్యాధి వల్ల వచ్చే మరణాలసంఖ్య మొత్తం మీద తక్కువే అయినప్పటికీ, రెండేళ్ల వయసులో పసితనంలో వచ్చిన వారికే రిస్కు ఎక్కువగా ఉంటుందని వివరించింది. అంత చిన్న వయసులో బ్రాంకైటిస్ అంటే ఊపిరి సక్రమంగా అందని పరిస్థితి ఏర్పడినా, లేదా న్యుమోనియా వంటి దిగువ శ్వాసనాళ ఇన్‌ఫెక్షన్ సంక్రమిస్తే పెద్దయ్యాక శ్వాసకోశ వ్యాధి వల్ల 93 శాతం వరకు అకాల మరణం సంభవించే ప్రమాదం ఉంటుందని లాన్సెట్ అధ్యయనం హెచ్చరించింది. సామాజిక ఆర్థిక నేపథ్య చరిత్ర , స్మోకింగ్ వంటి అలవాట్లకు ఈ రిస్కుకు ఎలాంటి సంబంధం లేదు. ఇలాంటి అకాల మరణాలు 2017లో దాదాపు 3.9 మిలియన్ వరకు సంభవించాయి. ప్రపంచం మొత్తం మీద సంభవించిన అన్ని మరణాల్లో ఇవి ఏడు శాతం వరకు ఉన్నాయని పరిశోధకులు వివరించారు. క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సిఒపిడి) వల్లనే ఈ మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయని పరిశోధకులు విశ్లేషించారు. బ్రిటన్ లోని నేషనల్ సర్వే ఆఫ్ హెల్త్ అండ్ డెవలప్‌మెంట్ డేటాను ఈ అధ్యయనానికి ఆధారంగా వాడుకున్నారు. 1946లో జన్మించిన వారి రికార్డులను పరిశీలించి వారిని అధ్యయనంలో చేర్చుకున్నారు. 2019 సంవత్సరం వరకు వారి ఆరోగ్య పరిస్థితి, మరణాల రికార్డులను అధ్యయనం చేశారు. ఈ విధంగా అధ్యయనంలో చేర్చిన 3589 మందిలో 25 శాతం మందికి రెండేళ్ల వయసుకు ముందే ఎల్‌ఆర్‌టిఐ సంభవించిందని తేలింది. 2019 సంవత్సరం పూర్తయ్యేసరికి వీరిలో 19 శాతం మంది 73 ఏళ్లకు ముందే చనిపోయారని వెల్లడైంది. ఈ పెద్దల అకాల 674 మరణాల్లో 8 శాతం శ్వాసకోశ వ్యాధి, ముఖ్యంగా సిఒపిడి వల్లనే అని తేలింది.

Post a Comment

0Comments

Post a Comment (0)