రేపటి నుంచి కొత్తగా టీ 6, ఎఫ్ 24 టికెట్లు !

Telugu Lo Computer
0


హైదరాబాద్ జీఎచ్ఎంసీ పరిధిలో రూ. 50 రూపాయల టికెట్‌తో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆరు గంటల పాటు మహిళలు, సీనియర్ సిటిజన్స్ ప్రయాణం చేసేలా టీ 6 టికెట్ ను తీసుకొచ్చింది. శని, ఆదివారాలతో పాటు పబ్లిక్ హాలిడేస్ లో ఒక ఫ్యామిలీలో నలుగురు రూ. 300 రూపాయలతో ఒక రోజంతా ప్రయాణం చేసేందుకు ఎఫ్ 24 టికెట్ ను తెలంగాణ ఆర్టీసీ తీసుకొచ్చింది. టీ 6, ఎఫ్ 24 ఆఫర్లకు సంబంధించిన పోస్టర్లను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బస్ భవన్‌లో విడుదల చేశారు. ఈ ప్రత్యేకమైన ఆఫర్లు రేపటి నుంచి హైదరాబాద్ ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ఈ టికెట్లు శుక్రవారం నుంచి బస్ కండక్టర్ల వద్ద అందుబాటులో ఉంటాయి. గతంలో గ్రేటర్‌ హైదరాబాద్‌లో తీసుకు వచ్చిన టి-24 టికెట్‌కు ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఈ క్రమంలో ప్రయాణికులపై ఆర్థిక భారం తగ్గించేందుకు టీఆర్ఎస్ టీ 6, ఎఫ్ 24 ఆఫర్లు ప్రకటించింది. వీకెండ్, సెలువు దినాల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి ప్రయాణించేందుకు వీలుగా ఎఫ్‌-24 టికెట్‌ను సంస్థ అందుబాటులోకి తెచ్చింది. ఈ టికెట్‌కు రూ.300 చెల్లిస్తే, నలుగురు రోజంతా సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో ప్రయాణించవచ్చు. ఐదేళ్లలోపు చిన్నారులకు ప్రయాణం ఉచితం. ప్రస్తుతం గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో తిరిగే బస్సుల్లో టి-24 టికెట్‌ను సంస్థ అందజేస్తోంది. 24 గంటల పాటు ఆ టికెట్‌ చెల్లుబాటు అవుతుంది. ప్రస్తుతం టి-24 టికెట్‌ ధర పెద్దలకు రూ.100, పిల్లలకు రూ.60గా ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)