రాహుల్ గాంధీ దేశాన్ని అపఖ్యాతిపాలు చేస్తున్నారు !

Telugu Lo Computer
0


ప్రపంచ దేశాలు భారత్ ను పొగుడుతుంటే రాహుల్ గాంధీ మాత్రం విమర్శిస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా అన్నారు. పాకిస్తాన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలను చేసేందుకు భయపడుతోంది, కానీ రాహుల్ గాంధీ మాత్రం విదేశీ గడ్డపై దేశంలో ప్రజాస్వామ్యం లేదని, న్యాయవ్యవస్థ, మీడియా ప్రమాదంలో ఉందని ఆరోపిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ దేశాలు భారత దేశాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా చూస్తున్న తరుణంలో ఇక్కడ వ్యాపారం చేసేందుకు చైనాను విడిచిపెడుతున్న సమయంలో రాహుల్ గాంధీ ఇండియాలో పెట్టుబడులు పెట్టకుండా నిరోధిస్తున్నారని ఆరోపించారు. భారత దేశాన్ని అపఖ్యాతిపాలు చేసేందుకు రాహుల్ గాంధీ ఏజెంట్ గా పనిచేస్తున్నారా..? అని ప్రశ్నిస్తుంచారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ప్రసంగిస్తూ భారత దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని, తనతో పాటు పలువురు రాజకీయ నాయకులు నిఘాలో ఉన్నారని రాహుల్ ఆరోపించారు. మైనారిటీలను దేశంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారని రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని.. ఆయన, గాంధీ కుటుంబం దేశాన్ని నాశనం చేయడానికి ఎందాకైనా వెళ్తారని సంబిత్ పాత్ర ఆరోపించారు. రాహుల్ గాంధీ తన ప్రభ కోల్పోతున్నారని, అందుకే భారతదేశం గొప్పతనం అర్ధం కాదని అన్నారు. పెగాసస్ మాల్వేర్ ద్వారా నిఘా పెడుతున్నారని రాహుల్ ఆరోపిస్తున్నారు. అయితే ఈ అంశంపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన దర్యాప్తు కమిటీకి రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నాయకులు ఎందుకు మొబైల్స్ ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలోనే ప్రతిపక్షాల ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపించారు. చైనాలో ఎల్లో రివర్ జాతీయవాదానికి కారణం అయిందని చెబుతున్న రాహుల్ గాంధీకి, భారత్ లోని గంగా నదీ కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)