ఆంధ్రప్రదేశ్ లో 72 ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్లు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో సముద్ర ఉత్పత్తులు, రొయ్యలు, ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్, పెట్రోలియం, ఇంజినీరింగ్ గూడ్స్ మొదలైన రంగాలలో గొప్ప వనరులు, అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నిరంతరం సహకారం ఇస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ కి  రైల్వే బడ్జెట్ కేటాయింపులు 2014లో రూ.886 కోట్లు ఉంటే. ఇప్పుడు రూ.8406 కోట్లకు అంటే 9 రెట్లు పెరిగాయని వెల్లడించారు. రాష్ట్రంలో 72 ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్లను నిర్మిస్తామని చెప్పారు. మూడు పారిశ్రామిక కారిడార్లు ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. విశాఖపట్నం స్మార్ట్ సిటీకి మొత్తం పెట్టుబడి వ్యయం రూ.3000 కోట్లు అవుతుందని కిషన్ రెడ్డి పేర్కొనారు.

Post a Comment

0Comments

Post a Comment (0)