ప్రపంచంలో బెస్ట్ ఎయిర్‌పోర్ట్ చాంగీ అంతర్జాతీయ విమానాశ్రయం !

Telugu Lo Computer
0


చక్కని విమానాశ్రయాలకు అమెరికా, యూరప్, గల్ఫ్ దేశాలు పెట్టింది పేరు. అక్కడి విమానాలు, విమానాశ్రయాలు తుడిచిన అద్దాల్లా మిలమిలా మెరుస్తుంటాయి. ప్రముఖ ఎయిర్ పోర్టుల్లో అంతర్జాతీయ సర్వీసులు నడుస్తుంటాయి కనుక వాటిని తమ దేశ ప్రతిష్టలకు సవాలుగా తీసుకుని అత్యాధునికంగా తీర్చిదిద్దుతుంటారు. ఎయిర్ పోర్టుకు ఎంత పేరొస్తో, అంత ఆదాయం. మన దేశంలో కూడా వేల కోట్లు ఖర్చుపెట్టి విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తున్నారు. అయితే చాలా ఎయిర్‌పోర్టుల్లో సదుపాయాలు అంతంత మాత్రమేని విదేశీయులు పెదవి విరుస్తుంటారు. మన దేశంలోనే కాదు, అమెరికా, యూరప్, చైనా తదితర దేశాల్లోనూ దాదాపు పరిస్థితి అంతే. ప్రపంచంలో అత్యంత ఉత్తమ విమనాశ్రయంగా ఆసియాలోని సింగపూర్‌కు చెందిన ఎయిర్ పోర్టు ఎంపిక కావడమే దీనికి ఉదాహరణ. సింగపూర్‌లోని చాంగీ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ ఘనత కొట్టేంది. టాప్ 20లో అమెరికాకు చెందిన ఒక్క ఎయిర్ పోర్టు కూడా చోటు దక్కించుకోకపోవడం గమనార్హం. స్కైట్రాక్స్ అనే సంస్థ ఈ జాబితా రూపొందించింది. ప్రయాణికులు జర్నీ చేశాక ఇచ్చే ఫీడ్ బ్యాక్ రేటింగ్ బట్టి ఈ జాబితా తయారు చేసింది. గత జాబితాలో ఖతర్ రాజధాని దోహాలోని హమద్ ఎయిర్ పోర్టు అగ్రస్థానంలో ఉండేది. అయితే కరోనా వల్ల ఖతర్ విదేశీ విమాన సర్వీసులప ఆంక్షలు విధించడంతో ఆ స్థానం గల్లంతై చాంగీ పైకి ఎగబాకింది. చాంగీలో అత్యుత్తమ పరిశుభ్రత, సిబ్బంది ప్రవర్తన, ఆధునిక సదుపాయాలు అన్నింటిపై ప్రయాణికులు సంతృప్తి వ్యక్తం చేసి మాంచి రేటింగ్ ఇచ్చారు. టాప్ 20లో జపాన్ ఏకంగా 4 ర్యాంకులు కొట్టేసి సింహభాగం ఆక్రమించింది. న్యూయార్క్ ఎయిర్ పోర్టు 88 స్థానంలో నిలిచింది. భారత్/దక్షిణాసియాలో ఉత్తమ ప్రాంతీయ ఎయిర్పోర్టు, ఉత్తమ సిబ్బంది గల ఎయిర్ పోర్టుగా శంషాబాద్ విమానాశ్రయానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. భారత్/ దక్షిణాసియాలో ఉత్తమ ఎయిర్‌పోర్ట్, శుభ్రమైన ఎయిర్ పోర్ట్, ఫోర్ స్టార్ ఎయిర్‌పోర్టుగా ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నిలిచింది. టాప్ 100 జాబితాలో ఢిల్లీకి 36, శంషాబాద్‌కి 65, బెంగళూరుకు 69, ముంబైకి 84వ ర్యాంకు దక్కాయి. స్కైట్రాక్ జాబితా ప్రకారం టాప్ టెన్ వరసగా చాంగి (సింగపూర్), హమద్ (దోహా, ఖతర్), హనీదా (టోక్యో, జపాన్), ఇన్చెయాన్ (సియోల్, ద. కొరియా), చాల్స్ డి గాల్ (పారిస్, ఫ్రాన్స్), ఇస్తాంబుల్ (తుర్కియే), మ్యూనిక్ (జర్మనీ), జ్యూరిక్ (స్విట్జర్లాండ్), నరీటా (టోక్యో, జపాన్), బరాజస్ (మాడ్రిడ్, స్పెయిన్)

Post a Comment

0Comments

Post a Comment (0)