విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు తిరస్కరణ

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఛార్జీలకు సంబంధించిన విద్యుత్‌ టారిఫ్‌ను ఏపీ ఈఆర్సీ ఛైర్మన్‌ , రిటైర్డ్‌ జస్టిస్‌ సీవి. నాగార్జునరెడ్డి రిలీజ్‌ చేశారు. ఆర్థిక అవసరాలపై డిస్కంలు ఇచ్చిన టారిఫ్‌ ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి టారిఫ్‌పై నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. మూడు  డిస్కంలకు (రైతులకు ఫ్రీ కరెంట్, ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్లు వరకు ఇస్తున్న సబ్సిడీ.. ఆక్వా రంగం, నాయీ బ్రాహ్మణలకు ఇస్తున్న విద్యుత్ రాయితీలు) కలిపి ప్రభుత్వం సబ్సిడీగా ఇచ్చే విద్యుత్‌ వల్ల 10,135 కోట్ల ఆదాయ లోటు వచ్చిందన్నారు. సాధారణ, పారిశ్రామిక వినియోగదారుల కేటగిరిలో ఎవరిపై అదనపు ఛార్జ్‌లు ఉండబోవన్నారు.  ఈ ఏడాది విద్యుత్ వినియోగదారులు ఎటువంటి భారం మోపడంలేదని, ఎనర్జీ ఇంటెన్సివ్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీలకు ఇచ్చే హెచ్‌టీ వినియోగదారులకు మాత్రం కిలోవాట్‌కు 475 రూపాయల అదనపు డిమాండ్‌ ఛార్జ్‌ల ప్రతిపాదనను అంగీకరించామన్నారు. వీటి టారిఫ్‌ దేశంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ తక్కువేనన్నారు. మిగతా పెంపు ప్రతిపాదనలు తిరస్కరించామన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)