మా తాత ఏళ్ల తరబడి జైలు జీవితం గడిపింది దీని కోసం కాదు !

Telugu Lo Computer
0


కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడటంతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాగా ఈ పరిణామాలపై భారత అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు రో ఖన్నా ట్విటర్ వేదికగా ఈ అనర్హత వేటును ఖండించారు. 'రాహుల్‌ గాంధీ పార్లమెంట్‌ సభ్యత్వంపై వేటు వేయడం.. గాంధీ సిద్ధాంతాలకు, భారత దేశ విలువలకు తీవ్ర ద్రోహం చేయడమే అవుతుంది. మా తాతయ్య ఏళ్ల తరబడి జైలు జీవితం గడిపింది దీని కోసం కాదు. భారత ప్రజాస్వామ్యం కోసం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అధికారం మీకు ఉంది' అని అంటూ ప్రధాని నరేంద్రమోదీని ట్యాగ్ చేశారు. రాహుల్ అనర్హత గురించి న్యూయార్క్‌ టైమ్స్‌లో వచ్చిన కథనాన్ని షేర్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. రో ఖన్నా తాత అమర్‌నాథ్‌ విద్యాలంకార్‌ భారత స్వాతంత్య్ర పోరాటంలో పాలుపంచుకున్నారు. స్వాతంత్ర్య సమరంలో ప్రముఖ పాత్ర పోషించిన లాలా లజపతి రాయ్‌తో కలిసి పనిచేశారు. ఈ క్రమంలో కొన్నేళ్లపాటు జైలు జీవితం గడిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)