సరిరారు నాకెవ్వరు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 17 March 2023

సరిరారు నాకెవ్వరు !


ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మథుర సమీపంలో ఉన్న నేషనల్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ గోట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ గోట్ ఫెయిర్ అండ్ ఎగ్జిబిషన్ లో బరువు విభాగంలో ఓ మేకపోతు ప్రథమ బహుమతిని గెలుపొందింది. గొర్రెలు, మేకపోతులకు సంబంధించి భారీ ప్రదర్శన ఇక్కడ జరగగా ఆ ప్రదర్శనలో ఓ మేకపోతు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 110 కిలోల బరువు 3 ఏళ్ల వయసు ఉన్న మేకపోతు, శరీరంపై ఎటువంటి నల్లని మచ్చలు లేని జమునా పారి మేకపోతు ఫస్ట్ ప్రైస్ కొట్టేసింది. ఇఈ మేకపోతు రాజస్థాన్ కు చెందినది. దీనిని శంకర్ కిచెన్ అనే రైతు పెంచుతున్నారు. 110 కిలోల బరువున్న ఈ మేకపోతు విలువ అక్షరాల ఆరు లక్షల రూపాయలు. ఇక ఈ ఫెయిర్ కు వచ్చిన వాళ్లంతా ఆ మేకపోతుని చూసి, చిన్న వయసులో 110 కిలోల బరువు, ఎత్తు, ఒళ్లంతా చక్కని ఊలుతో దిట్టంగా ఉన్న దాని తీరును చూసి దాని వివరాలు కనుకుంటున్నారు. ప్రతిరోజు దానికి ఆహారంగా ఏం పెడతారు? దాని జీవనశైలి ఎలా ఉంటుంది అని ఆ రైతును వివరాలడిగి తెలుసుకుంటున్నారు. నేషనల్ గోట్ ఫెయిర్ మరియు కిసాన్ గోష్టి సెంట్రల్ గోట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మఖ్దూం ఫరా మధురలో నిర్వహించబడింది. దీనిని చక్కెర మరియు చెరకు పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంత్రి చౌదరి లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఇనిస్టిట్యూట్ లోని శాస్త్రవేత్తలు, అధికారులు, ఉద్యోగులతో పాటు, వివిధ కౌన్సిల్ ఇన్స్టిట్యూట్లకు చెందిన ప్రతినిధులు, దాదాపు 1000 మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలు, రైతులు, మేకల పెంపకం దారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment