ఇల్లు కూలి కార్లు ధ్వంసం

Telugu Lo Computer
0


హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి ఆసిఫ్‌నగర్‌లోని దాయిబాగ్‌లో పాత ఇల్లు కూలింది. వానకు తడిసి గోడలు గురువారం రాత్రి 12గంటల సమయంలో ఒక్కసారిగా కూలిపోయాయి. అక్కడే పార్కు చేసిన రెండు కార్లపై గోడలు పడ్డాయి. పక్కనే ఆలయం, నిత్యం రాకపోకలతో రద్దీగా ఉంటుంది. రాత్రి సమయం కావడంతో ముప్పు తప్పిందని స్థానికులు చెప్పారు. ఆసిఫ్‌నగర్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎమ్మారై సురేష్‌ దాయిబాగ్‌కు చేరుకుని వివరాలు సేకరించారు. పాత ఇంట్లో ఎవరూ ఉండడం లేదని స్థానికులు చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)