రాతి ఉప్పు - ఉపయోగాలు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 18 March 2023

రాతి ఉప్పు - ఉపయోగాలు !


బీపీ కంట్రోల్‌లో ఉండాలంటే ఉప్పు తినడం మానేయాలని డాక్టర్లు చెప్పడం మనం తరచూ వింటూ ఉంటాం. అయితే ఉప్పుకు ప్రత్యామ్నాయంగా పింక్ సాల్ట్ లేదా రాక్ సాల్ట్ తింటే సరిపోతుందని చాలా మంది చెబుతుంటారు. అయితే ఈ రాక్ సాల్ట్ ను కూడా డబ్ల్యూహెచ్‌ఓ  హానికరమని ప్రకటించిందని, రాతి ఉప్పు వాడితే ప్రమాదమనే గుప్పుమంటున్నాయి.  డబ్ల్యూహెచ్‌ఓ వైట్ ఉప్పు వాడకాన్ని ప్రపంచం మొత్తానికి ఆందోళన కలిగించే విషయంగా అభివర్ణించింది. ప్రపంచంలోని ప్రతి వ్యక్తి ప్రతిరోజూ 10.8 గ్రాముల ఉప్పును వినియోగిస్తున్నారని, దానిని 5 గ్రాములకు తగ్గించాలని డబ్ల్యూహెచ్‌ఓ  తన నివేదికలో వెల్లడించింది. ఇప్పుడు వాడుతున్న ఉప్పు ఆరోగ్యం పరంగా మంచిది కాదని తేల్చింది. మన దేశంలో తెల్ల ఉప్పును విపరీతంగా వినియోగిస్తారు. అయితే రాతి ఉప్పు లేదా పింక్ సాల్ట్‌ను నవరాత్రులు లాంటి పండగల వేళ ఉపవాసాల్లో ఉపయోగిస్తారు. ఉపవాసం చేసే సమయంలో రాతి ఉప్పు నిజంగా చాలా ఉపయోగపడుతుంది. సాధారణ ఉప్పుకు బదులుగా రాక్ సాల్ట్ లేదా పింకు ఉప్పును వాడాలని కొందరును సూచిస్తున్నారు.  అయితే రాక్ సాల్ట్ సైతం అధికంగా ఉపయోగించడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు అయినప్పటికీ వైట్ సాల్ట్ తో పోల్చితే రాక్ సాల్ట్ ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. మెదడు చురుగ్గా ఉండేలా రాక్ సాల్ట్ పనిచేస్తుంది. సెరోటోనిన్, మెలటోనిన్ వంటి హార్మోన్లను ప్రేరేపించేందుకు రాక్ సాల్ట్ చాలా ఉపయోగపడుతోంది. వంటకాల్లో రాక్ సాల్ట్ వాడకం వల్ల ఆందోళన నుంచి చాలా ఉపశమనం లభిస్తుంది. సాధారణ ఉప్పు రక్తపోటును పెంచడానికి పనిచేస్తుంది. రాక్ సాల్ట్ మాత్రం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఇది బీపీని అదుపులో ఉంచుతుంది.  గోరువెచ్చని నీటిలో రాతి ఉప్పు వేసి పుక్కిలిస్తే గొంతుకు చాలా ఉపశమనం కలుగుతుంది. రాతి ఉప్పు చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు పేగులకు, ఇతర అవయవాలకు మేలు చేస్తాయి. అదే సమయంలో ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. రాక్ సాల్ట్ లో కూడా సోడియం ఉంటుంది. కానీ వైట్ సాల్ట్ తో పోల్చితే కొద్ది మొత్తంలో తక్కువగా ఉంటుంది. రుచిపరంగా చూసినట్లయితే రాక్ సాల్ట్ రుచి బాగుంటుంది. అయినప్పటికీ రాక్ సాల్ట్ ను కూడా పరిమితంగానే వాడాలని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తోంది. అయితే రాక్ సాల్ట్ తయారీ విధానంలో జాగ్రత్తగా ఉండాలని, గనుల నుంచి సేకరించే ఈ రాక్ సాల్ట్ ను శుద్ధి చేసిన అనంతరమే వాడాలని, లేకపోతే ఇందులో ఇతర మూలకాలు కలిసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

No comments:

Post a Comment