రెండు చెట్లను నాటి, రోజుకు ఐదుసార్లు నమాజ్ చేయండి : మాలేగావ్ కోర్టు - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 1 March 2023

రెండు చెట్లను నాటి, రోజుకు ఐదుసార్లు నమాజ్ చేయండి : మాలేగావ్ కోర్టు


మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉన్న మాలెగావ్ మేజిస్ట్రేట్ కోర్టు వింతైన తీర్పు ఇచ్చింది. రెండు చెట్లను నాటాలని, అలాగే రోజుకు ఐదుసార్లు నమాజ్ చేయాలని ఒక ఆటోరిక్షా డ్రైవర్‌కు శిక్ష విధించింది. రౌఫ్ ఖాన్ ఉమర్ ఖాన్ (30) అనే వ్యక్తి ఆటోరిక్షా డ్రైవర్. అతని ఆటో 2010లో మాలెగావ్ పవర్-లూమ్ పట్టణంలోని ఇరుకైన సందులో ఆగి ఉన్న బైక్‌ను ఢీకొట్టింది. బైక్ ఓనర్ ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేయగా, ఉమర్ ఖాన్ అతనిపై దాడి చేశాడు. కాగా బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు అనంతరం ఖాన్‌పై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌లు 323, 325, 504, 506 కింద కేసు నమోదు చేశారు. సెక్షన్ 323 ప్రకారం ఖాన్ దోషి అని మేజిస్ట్రేట్ పేర్కొనగా, మిగిలిన నేరాల కింద అతన్ని నిర్దోషిగా విడుదల చేశారు. చివరికి ఖైదు, జరిమానా లేకుండా ఖాన్ నిర్దోషిగా విడుదల చేయబడ్డాడు. అయితే రెండు చెట్లు నాటడంతో పాటు రోజుకు ఐదుసార్లు నమాజ్ చేయాలని మేజిస్ట్రేట్ ఆదేశించింది. క్రిమినల్ ప్రొబేషన్ యాక్ట్ 1958లోని సెక్షన్ 3 ప్రకారం నేరాన్ని పునరావృతం చేయకుండా, ఉపదేశించడం లేదా తగిన హెచ్చరిక తర్వాత దోషిని విడుదల చేయడానికి మేజిస్ట్రేట్‌కు అధికారం ఉందని, అయితే న్యాయస్థానం కేవలం హెచ్చరికతో సరిపోదని కోర్టు పేర్కొంది. దోషి హెచ్చరికను, అతని నేరాన్ని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యమని, తద్వారా అతను ఆ నేరాన్ని పునరావృతం చేయడని ధర్మాసనం పేర్కొంది. నేరం జరిగిన సోనాపురా మసీదు ప్రాంగణంలో ఖాన్ రెండు చెట్లను నాటాలి, చెట్లను సంరక్షించాలి. ఇస్లామిక్ విశ్వాసాన్ని అనుసరించే వ్యక్తి అయినప్పటికీ, మత గ్రంథాలలో పేర్కొన్న విధంగా తాను సాధారణ నమాజ్ చేయడం లేదని నిందితుడు విచారణలో అంగీకరించాడు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, తదుపరి 21 రోజుల పాటు, రోజుకు ఐదుసార్లు నమాజ్ చేయాలని కోర్టు దోషిని ఆదేశించింది. ఈ రెండు ఆదేశాలు 1958 చట్టంలోని సెక్షన్ 3 పరిధిలోకి వస్తాయని, అందుకే తగిన హెచ్చరిక అని మాలేగావ్ మేజిస్ట్రేట్ పేర్కొంది.

No comments:

Post a Comment