భారీగా పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధరలు

Telugu Lo Computer
0


ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరో సారి గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచేశాయి. ఈసారి అటు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు, ఇటు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు రెండూ కూడా పెరిగాయి. సుమారు 8 నెలల తర్వాత డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర 50 రూపాయలు పెరగడం గమనార్హం. నిన్న ఢిల్లీలో 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్‌ 1053 రూపాయలుగా ఉండగా ఇవాల్టి (మార్చి1) నుంచి 1103 రూయాయలకు చేరింది. ఇక కమర్షియల్‌ సిలిండర్‌ ధర నిన్న 1769రూపాయలు ఉండగా..ఇవాళ అది 2119 రూపాయలకు చేరింది. అంటే ఏకంగా రూ. 350 మేర పెరిగాయన్నమాట. అలాగే కోల్‌కతాలో చూస్తే.. దీని ధర రూ. 1870 నుంచి రూ. 2221కు పెరిగింది. ఇక ముంబైలో ఈ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1721గా ఉండేది. ఇప్పుడు దీని రేటు రూ. 2071కు చేరింది. చెన్నైలో ఈ సిలిండర్ ధర రూ. 2268కు పెరిగింది.

Post a Comment

0Comments

Post a Comment (0)