పిరికితనంతో చేస్తున్న కుట్ర తప్ప మరేంకాదు !

Telugu Lo Computer
0


మనీష్‌ సీసోడియా రాజీనామా లేఖలో పలు కీలక అంశాలు ప్రస్తావించారు. తనపై వస్తున్న ఆరోపణలను తప్పుబడుతూ గత ఎనిమిదేళ్లుగా నిజాయితీ, నిబద్దతతో పనిచేస్తుంటే అవినీతి ఆరోపణల్లో ఇరికించడం దురదృష్టకరమన్నారు. 'ఈ ఆరోపణలన్నీ అబద్దాలని నాతోపాటు ఆ దేవుడికి తెలుసు. ఇదంతా అరవింద్‌ కేజ్రీవాల్‌ స్వచ్ఛమైన రాజకీయాలకు బయపడి చేస్తున్న కొందరు బలహీనులు పిరికితనంతో చేస్తున్న కుట్ర తప్ప మరేం లేదు. నిజానికి వాళ్ల టార్గెట్ నేను కాదు, మీరే(కేజ్రీవాల్‌). ఎందుకంటే నేడు కేవలం ఢిల్లీ మాత్రమే కాదు దేశ ప్రజలంతా మిమ్మల్ని గొప్ప విజన్ ఉన్న నాయకుడిగా చూస్తున్నారు. సరికొత్త విధానాలను అమలు చేయడం ద్వారా వాళ్ల జీవితాల్లో పెను మార్పులు తీసుకురాగల సామర్థ్యం మీకు ఉందని ప్రజలు నమ్ముతున్నారు' అని అరవింద్ కేజ్రీవాల్‌కు సిసోడియా రాసిన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఆర్థిక సంక్షోభం, పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అవినీతి వంటి సమస్యలను ఎదుర్కొంటున్న కోట్లాది మంది కళ్లల్లో అరవింద్‌ కేజ్రీవాల్‌ ఓ ఆశాదీపంగా కనిపిస్తున్నారని ఆయన అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)