రాహుల్‌ గాంధీ కేసును తమ దేశం గమనిస్తోంది !

Telugu Lo Computer
0


రాహుల్‌ గాంధీపై కోర్టు కేసు, అనర్హతవేటు తదితర పరిణామాలపై అమెరికా స్పందించింది. రాహుల్‌ గాంధీ కేసును తమ దేశం గమనిస్తోందని, భావప్రకటనా స్వేచ్ఛతో సహా ప్రజాస్వామ్య విలువలకు భాగస్వామ్య నిబద్ధత విషయంలో భారత ప్రభుత్వంతో అమెరికా ఎప్పుడూ నిమగ్నమై ఉంటుందని పేర్కొంది. రాహుల్‌ గాంధీని అనర్హత వేటు పరిణామంపై అమెరికా అధికార ప్రతినిధి వేదాంత్‌ పటేల్‌కు సోమవారం మీడియా నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన స్పందిస్తూ చట్టబద్ధమైన పాలన, న్యాయ స్వాతంత్ర్యం పట్ల గౌరవం ఏ ప్రజాస్వామ్యానికైనా మూలస్తంభం. భారత దేశంలోని కోర్టులలో మిస్టర్‌ గాంధీ  కేసును మేము గమనిస్తూనే ఉన్నాం. భావ స్వేచ్ఛ ప్రకటన సహా ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు భారత్‌తో కలిసి మేం ముందుకు నడుస్తాం. ఇరు దేశాల ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేసేందుకు.. కీలకమైన మానవ హక్కుల పరిరక్షణను (భావ స్వేచ్ఛ ప్రకటనసహా), ప్రజాస్వామ్య విలువల ప్రాముఖ్యతను ఎప్పటికప్పుడు హైలెట్‌ చేస్తూనే వస్తున్నాం అని తెలిపారాయన.  ఈ విషయంలో భారత ప్రభుత్వంతో గానీ, రాహుల్‌ గాంధీతో గానీ అమెరికా ఏమైనా సంప్రదింపులు జరిపిందా? అని ప్రశ్నించగా అలాంటిదేం జరగలేదని ఆయన బదులిచ్చారు.


Post a Comment

0Comments

Post a Comment (0)