ఎల్వీఎం-30 రాకెట్ ప్రయోగం విజయవంతం

Telugu Lo Computer
0


భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఆదివారం ఏకకాలంలో 36 ఉపగ్రహాలను ప్రయోగించింది. ఇస్రో చేపట్టిన ఈ భారీ రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. సరిగ్గా అనుకున్న సమయానికే 9 గంటలకు నింగిలోకి ఎల్వీఎం-30 దూసుకుపోయింది. వన్‌వెబ్ ఇండియా-2 పేరుతో 5,805 కిలోల బరువు కలిగిన 36 సమాచార ఉపగ్రహాలను భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులోని లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టారు. రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో అధిపతి డాక్టర్‌ సోమనాథ్‌ ఆనందం వ్యక్తం చేశారు. 43 టన్నుల బరువు, 43.5 మీటర్ల పొడవున్న ఈ లాంచ్ వెహికల్ చంద్రయాన్-2 మిషన్‌తో సహా ఇప్పటివరకు ఐదు విజయవంతమైన ప్రయోగాలను పూర్తి చేసిన ఇస్రో అత్యంత భారీ ప్రయోగ వాహనం. ఈ 36 ఉపగ్రహాల బరువు 5805 టన్నులు. యూకే కంపెనీకి చెందిన 36 ఉపగ్రహాలతో కలిసి బయలుదేరింది. ఎల్వీఎం3 ప్రయాణించిన ఉపగ్రహాల మొత్తం బరువు 5 వేల 805 టన్నులు. ఈ మిషన్‌కు LVM3-M3 / OneWeb India-2 అని పేరు పెట్టారు. ఈ మిషన్ ప్రయోగం గురించి ఇస్రో ట్వీట్ ద్వారా తెలియజేసింది. LVM3 అనేది చంద్రయాన్-2 మిషన్‌తో సహా ఇప్పటివరకు ఐదు విజయవంతమైన ప్రయోగాలను పూర్తి చేసిన ఇస్రో అత్యంత భారీ ప్రయోగ వాహనం. వాస్తవానికి.. బ్రిటన్‌కు చెందిన వన్‌వెబ్ గ్రూప్ కంపెనీ 72 ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్‌తో జతకట్టింది.భూ కక్ష్యలో 23 ఉపగ్రహాలు. ఇందులో ఇస్రో ఇప్పటికే 23 అక్టోబర్ 2022న 23 ఉపగ్రహాలను ప్రయోగించింది. నేడు మిగిలిన 23 ఉపగ్రహాలను భూ కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఇస్రో ఈ ప్రయోగంతో భూ కక్ష్యలో వెబ్ వన్ కంపెనీకి చెందిన మొత్తం ఉపగ్రహాల సంఖ్య 616 అవుతుంది. అదే సమయంలో ఇస్రోకు ఈ ఏడాదిలో ఇది రెండో ప్రయోగం. ఇస్రో ప్రయోగం విజయవంతం కావడంతో వన్‌వెబ్ ఇండియా-2 అంతరిక్షంలో 600 కంటే ఎక్కువ దిగువ భూ కక్ష్య ఉపగ్రహాల కూటమిని పూర్తి చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)