జేఎన్ యూలో కొత్త రూల్స్ : ధర్నా చేస్తే 20 వేలు

Telugu Lo Computer
0


జేఎన్ యూ కొత్త రూల్స్ ను ప్రవేశపెట్టింది. ఇకపై కళాశాల ప్రాంగణంలో ధర్నా చేస్తే రూ. 20ల జరిమానా, హింసకు పాల్పడితే అడ్మిషన్ రద్దు తో పాటు రూ. 30,000 వరకు జరిమానా, ప్రవర్తన బాగోలేకపోయినా క్రమశిక్షణ తప్పినా రూ.50వేలు ఫైన్ విధిస్తామని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం తాజా నిబంధనలో పేర్కొంది. రూల్స్ ఆఫ్ డిసిప్లెయిన్ అండ్ ప్రాపర్ కాండక్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ జె ఎన్ యూ పేరిట 10 పేజీల కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది . జేఎన్ యూలో ఇకపై నిరసనలు, ఫోర్జరీలు చేస్తే అందుకు తగ్గట్లుగా శిక్షలు ఉంటాయని తాజా నిబంధనల ద్వారా తెలుస్తోంది. ఈ నియమాలు ఫిబ్రవరి 3 నుండి అమల్లోకి రానున్నాయి. బీబీసీ  డాక్యుమెంటరీ లో విశ్వవిద్యాలయంలో జరిగిన నిరసనలు ప్రదర్శించడంతో ఈ చర్యలకు జెఎన్ యూ ఉపక్రమించిందని తెలుస్తోంది. ప్రతి విద్యార్ధి హాజరు తప్పనిసరి అని వర్శిటి ప్రకటన చేసింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో పకోడీలు అమ్మడం ఉపాధిగా పరిగణించబడుతుందని మోడీ చెప్పారు. ఈ ఇంటర్వ్యూని బేస్ చేసుకుని వర్శిటీ ప్రకటనకు వ్యతిరేకంగా విద్యార్థులు ఫిబ్రవరి 5 న పకోడాలు అమ్మాలని నిర్ణయించుకున్నారు. సబర్మతి బస్టాండ్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ సమీపంలోని టి-పాయింట్ వద్ద రహదారిని బ్లాక్ చేయడంతో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, సందర్శకులు, పాఠశాల విద్యార్థులకు తీవ్ర అసౌకర్యం కలిగించారు. హాస్టళ్లకు అవసరమైన వస్తువులను తీసుకువెళ్లే వాహనాలు ఈ నిరసనతో ప్రభావితం అయ్యాయి. అంతే కాదు ఈ నిరసనను విరమించుకోవాలని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పదే పదే అభ్యర్థించినప్పటికీ విద్యార్ధులు బలవంతంగా ధర్నా పాయింట్ లోనే ఆహారాన్ని వండారు. అంతేకాకుండా, రాత్రి పూట నిరసన ప్రదేశంలో విద్యుత్ కేబుల్‌ను ఏర్పాటు చేసుకుని చలనచిత్ర ప్రదర్శన చేసి నిరసనను కొనసాగించారు. ఇదంతా విద్యార్ధుల్లో క్రమశిక్షణ లోపించడం వల్లే జరిగిందని తెలుస్తోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)