ఈడీ ఆఫీసుకు 18 పార్టీల ఎంపీల మార్చ్ !

Telugu Lo Computer
0


పార్లమెంట్ ను అదానీ-హిండెన్‌బర్గ్ అంశం కుదిపేస్తుంది. అదానీపై జేపీసీతో దర్యాప్తు చేపట్టాలని విపక్ష సభ్యులు లోక్ సభలో డిమాండ్ చేశారు. విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకువెళ్లి నినాదాలు చేశారు. ఈ కారణంగా సభలో గందరగోళం నెలకొన్నది. అదానీ అంశం విషయంలో విపక్ష సభ్యులు ఆందోళనలు విరమించకపోవడంతో.. స్పీకర్ బిర్లా సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు. మరోవైపు రాజ్యసభలోనూ విపక్ష సభ్యులు ఇదే తరహా ఆందోళన చేపట్టారు. నిదాదాలు చేస్తూ వెల్ లోకి దూసుకుపోయారు. దీంతో చైర్మెన్ జగదీప్ ధన్‌కర్ రాజ్యసభను 2 గంటల వరకు వాయిదా వేశారు. ఇదిలా ఉండగా.. పార్లమెంటు నుంచి ఈడీ కార్యాలయం వరకు మార్చ్ చేపట్టాలని 18 ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి. మధ్యాహ్నం గం 12.30కు పార్లమెంటు నుంచి కాలినడకన బయలుదేరనున్న ప్రతిపక్ష పార్టీల నేతలు. అదానీ- హిండెన్ బర్గ్ వ్యవహారంపై ఈడీకి ప్రతిపక్షాలు ఫిర్యాదు చేయనున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)