ఈడీ నోటీసులపై కవితకు స్టే నిరాకరణ

Telugu Lo Computer
0


ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారణకు హాజరుకావాలని ఈడీ ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని ఆమె కోరారు. తనకు ఇచ్చిన నోటీసులో ఇతరులతో కలిపి విచారిస్తామన్నారని, కానీ అలా చేయలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే మొబైల్ సీజ్ చేశారని తెలిపారు. సీఆర్‌పీసీ 160 సెక్షన్‌ ప్రకారం మహిళను తన ఇంట్లోనే విచారించాలని, కానీ ఈడీ కార్యాలయానికి పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే మధ్యంతర రిలీఫ్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ పిటిషన్‌పై ఈనెల 24న విచారణ చేపడతామని చెప్పింది. కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత గురువారం(మార్చి 16) మరోసారి ఈడీ ఎదుట హాజరుకానున్న విషయం తెలిసిందే. ఈనెల 11న ఈడీ అధికారులు ఆమెను 9 గంటలపాటు విచారించారు. 16న మళ్లీ విచారణకు హాజరుకావాలన్నారు. ఈనేపథ్యంలోనే ఆమె ఈడీ నోటీసులపై స్టే ఇవ్వాలని సుప్రీంను ఆశ్రయించగా నిరాశ ఎదురైంది.


Post a Comment

0Comments

Post a Comment (0)