మాఫియాలను ప్రభుత్వం అంతం చేస్తుంది !

Telugu Lo Computer
0


బహుజన్ సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యే హత్య కేసులో సాక్షిగా ఉన్న వ్యక్తిని కొంతమంది దుండగులు హత్య చేశారు. దీనిపై యూపీ అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. సీఎం యోగి ఆదిత్యనాథ్, అఖిలేష్ యాదవ్ వైపు వేలు చూపిస్తూ హెచ్చరించారు. 2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య జరిగింది. ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ హత్యకు గురయ్యారు. ఈ వ్యవహారంపై ఇరు నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సమాజ్ వాదీ పార్టీ మాఫియాను ప్రోత్సహిస్తోందని సీఎం ఆరోపించారు. వాళ్లందరిని '' మట్టిలో కలిపేస్తాం'' అని హెచ్చరించారు. ఉమేష్ పాల్ శుక్రవారం ప్రయాగ్ రాజ్ లోని తన నివాసంలో బాంబుదాడిలో చంపబడ్డాడు. ఈ దాడిలో అతని గన్ మెన్ కూడా గాయపడ్డాడు, ఆ తరువాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మాజీ ఎంపీ సమాజ్ వాదీ పార్టీ నేత అతిక్ అహ్మద్, అతని తమ్ముడు ఖలీద్ అజీమ్ ను ఓడించి రాజుపాల్ అలహాబాద్ పశ్చిమ నియోజకవర్గంలో గెలిచారు. ఆయన గెలిచిన కొన్ని నెలల తర్వాత హత్యకు గురయ్యారు. రాజుపాల్ హత్య కేసులో అతిక్ అహ్మద్, అతని సోదరుడు, మాజీ ఎమ్మెల్యే అష్రఫ్ ప్రధాన నిందితులుగా ఉన్నారు. నిందితులంతా ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఈ క్రమంలో అసెంబ్లీలో సమాజ్ వాదీ పార్టీపై సీఎం యోగి ఆదిత్య నాథ్ తీవ్ర స్వరంతో మండిపడ్డారు. ఎస్పీ నేరస్తులను ఆదరిస్తోందని, వారికి పూలమాలలతో స్వాగతం పలుకుతున్నారని, ఆపై రాష్ట్రంలో శాంతిభద్రతలపై డ్రామాలు ఆడుతున్నారని సీఎం విమర్శించారు. మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ కు మద్దతు ఎస్పీ మద్దతు ఇచ్చింది వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని మాఫియాలను ప్రభుత్వం అంతం చేస్తుందని అన్నారు. సీఎం యోగి వివర్శలపై అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ నిన్న బాంబులు పేల్చిన తీరు చూస్తే ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, గ్యాంగ్ వార్ లాంటి పరిస్థితులు ఏర్పడినట్లు స్పష్టం అవుతుందని అన్నారు. బాహటంగా తుపాకులు పేల్చేది రామరాజ్యమా..? అని ప్రశ్నించారు. పోలీసులు పూర్తిగా విఫలం అయ్యారని, బీజేపీ ఈ ఘటనకు బాధ్యత వహించాలని అన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)