బీజేపీకి కార్పొరేట్ విరాళాల పంట !

Telugu Lo Computer
0


దేశంలోని జాతీయ పార్టీలకు వచ్చిన మొత్తం విరాళాల్లో బీజేపీ వాటా 80శాతంగా ఉందని ఏడీఆర్ రిపోర్ట్ ప్రకటించింది. గత ఆర్థిక ఏడాది (2021-22) దేశంలోని ఎనిమిది జాతీయ పార్టీలకు విరాళంగా 7వేలా 141కోట్లలో నిధులలో అధిక వాటా కమలం పార్టీకే దక్కడం కార్పొరేట్లకు ఆ పార్టీ వేస్తోన్న పెద్ద పీట ఏమిటో అర్థమవుతోంది. విరాళాల వివరాలను అసోసియేషన్ ఆఫ్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. రెండో స్థానంలో కాంగ్రెస్ రూ. 95 కోట్లను విరాళంగా పొందింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) రూ.58 కోట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఎనిమిది జాతీయ పార్టీలకు ఇచ్చిన విరాళాలలో కార్పొరేట్లు మరియు వ్యాపార సంస్థల నుంచి వచ్చిన రూ. 780 కోట్లలో రూ. 625 కోట్లు బీజేపీ(BJP) వాటాగా వెల్లడించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి బీజేపీకి రూ. 614.52 కోట్లు అందాయని, కాంగ్రెస్ రూ.95.45 కోట్లు, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రూ.44.54 కోట్లు అందాయని తేల్చింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో జాతీయ రాజకీయ పార్టీలు స్వీకరించిన రూ. 20వేల కంటే ఎక్కువ మొత్తం విరాళాలను ఏడీఆర్ పరిగణనలోకి తీసుకుంది. ఎనిమిది జాతీయ పార్టీల డేటాను పరిశీలించింది: భారతీయ జనతా పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ మరియు నేషనల్ పీపుల్స్ పార్టీ లను విరాళాలను అధ్యయనం చేసింది. 2021-22 సంవత్సరంలో మొత్తం ఎనిమిది జాతీయ పార్టీలు మొత్తం 7,141 విరాళాలు అందుకున్నాయని, అందులో బీజేపీ రూ.780.7 కోట్లు వాటాగా పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 30% బీజేపీ విరాళం పెరిగింది గత ఏడాది 2020-21 ఆర్థిక సంవత్సరానికి కేవలం 3,753 విరాళాల నుండి బీజేపీకి రూ. 593.7 కోట్లు వచ్చాయని పొందుపరిచింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి 2,206 విరాళాల మొత్తం నుంచి రూ. 477.5 కోట్లను బిజెపి(BJP) పొందింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 1,255 విరాళాల నుండి, కాంగ్రెస్ రూ. 95.4 కోట్ల నిధులను సేకరించింది. దాదాపు రూ.58 కోట్ల విలువైన విరాళాలు అందుకోవడం ద్వారా ఎన్సీపీ తర్వాతి స్థానంలో నిలిచింది. 2021-22లో బీజేపీకి విరాళాల రూపంలో వచ్చిన నిధులు ఆరు పార్టీలు ప్రకటించిన మొత్తం కంటే మూడు రెట్లు ఎక్కువ అని నివేదిక పేర్కొంది. సుమారు రూ. 548 కోట్ల కార్పొరేట్ విరాళాలలో బిజెపి వాటా, వ్యాపార సంస్థల నుండి ఇతర జాతీయ పార్టీలు అందుకున్న మొత్తం నిధుల కంటే ఏడు రెట్లు ఎక్కువ. బీజేపీ మినహా ఏడు జాతీయ పార్టీలు కార్పొరేట్ సంస్థల నుంచి ఏకంగా రూ.77 కోట్లు అందుకున్నాయి. ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ మొత్తం రూ.353 కోట్లలో బీజేపీ రూ.336.5 కోట్లు, కాంగ్రెస్ రూ.16.50 కోట్లు మాత్రమే అందజేశాయి. ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుండి బిజెపి తన నిధులలో సగానికి పైగా పొందింది. కాంగ్రెస్ అదే మూలం నుండి మొత్తం నిధులలో 17.28% పొందింది. 2021-22 సంవత్సరంలో 4,506 మంది వ్యక్తిగత దాతలు రూ. 153.328 కోట్లను (మొత్తం విరాళాలలో దాదాపు 20%) పార్టీలకు విరాళంగా ఇచ్చారు. BJP, INC మరియు CPI(M) 452 విరాళాల ప్రీమనెంట్ అకౌంట్ నంబర్  వివరాలను ప్రకటించలేదని, దీని ద్వారా పార్టీలు మొత్తం రూ. 10.843 కోట్లను సేకరించాయని నివేదిక పేర్కొంది . ఐదు పార్టీలు ప్రకటించిన 1,500 కంటే ఎక్కువ విరాళాలు కూడా అసంపూర్ణమైన చెక్కు లేదా DD వివరాలను కలిగి ఉన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)