విమానంపై తిరిగి ప్రత్యక్షమైన హనుమాన్ స్టిక్కర్ !

Telugu Lo Computer
0


బెంగళూర్ లో జరుగుతున్న ఏరో ఇండియా షోలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) రూపొందించిన ప్రోటోటైప్ ఎయిర్‌క్రాఫ్ట్ పై హనుమంతుడి బొమ్మ వివాదాస్పదం అయింది. అయితే దీనిని ఆ తరువాత తొలగించారు. ఇదిలా ఉంటే చివరి రోజు విమానంపై హనుమాన్ స్టిక్కర్ ప్రత్యక్షం అయింది. దీనిపై హెచ్ఏఎల్ అధికారులు మౌనంగా ఉన్నారు. ఇటీవల ఏరో షో తొలిరోజు విమానాల ప్రదర్శనలో భాగంగా హెఏఎల్ కొత్తగా రూపొందించిన సూపర్ సోనిక్ ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ HLFT-42 తోకపై హనుమాన్ బొమ్మ ఉంది. అయితే దీనిని ఆ తరువాతి రోజు తొలగించారు. అయితే ఏరో షోలో చివరి రోజు మళ్లీ హనుమాన్ చిత్రం కనిపించడం విశేషం. విమానం శక్తిని సూచించేందుకే హనుమంతుడి చిత్రాన్ని ఉపయోగించాలని నిర్ణయించినట్లు హెచ్ఏఎల్ వెల్లడించింది. ఆంజనేయుడు ఎగురుతున్నట్లు విమానంతోకపై ఉన్న చిత్రం సూచిస్తుంది. దీనికింద 'ద స్ట్రోమ్ ఈజ్ కమింగ్' అనే క్యాప్షన్ కూడా ఉంది. హెచ్‌ఏఎల్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సిబి అనాథకృష్ణన్ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కాగా.. మరోసారి హనుమాన్ బొమ్మ విమానంపై ప్రత్యక్షమైంది.


Post a Comment

0Comments

Post a Comment (0)