కాకతీయుల కాలంలో పేరిణి నాట్య రూపకం విశేష ఆదరణ : మోడీ

Telugu Lo Computer
0


98వ మన్‌ కీ బాత్‭ లో  ప్రధాని మోడీ పేరిణి నాట్య రూపకంపై ప్రస్తావించారు. పేరిణి ఒడిస్సి నృత్యరూపకంపై జాతీయ అవార్డు పొందిన రాజ్ కుమార్ నాయక్‭ కు మోడీ అభినందనలు తెలిపారు. తెలంగాణలో 31 జిల్లాల్లో 101 రోజుల పాటు ఈ నృత్య రూపకం ప్రదర్శన చేశారని మోడీ గుర్తు చేశారు. 'పేరిణి శివతాండవం' పేరుతో శివుడికి ఈ నృత్య రూపకాన్ని శివుడికి అంకితం చేశారు. తెలంగాణలోని కాకతీయుల కాలంలో పేరిణి నాట్య రూపకం విశేష ఆదరణ పొందిందని మోడీ తెలిపారు. కొన్ని సంప్రదాయాలు కనుమరుగయ్యాయని, వాటిని పునరుద్దరించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. భారతదేశ చరిత్ర, సంస్కృతిని కాపాడేందుకు కళాకారులను ప్రోత్సహించాలని ప్రధాని అన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమాన్ని పౌరులు అద్భుతమైన వేదికగా చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఇంటింటికి డిజిటల్ సేవలు అందించాన్న మోడీ,  ప్రతి ఇంటికి ఆ సేవలు అందినప్పుడే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని చెప్పారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)