అదనపు సమయం ఇవ్వలేదని పరీక్షా హాలు ధ్వంసం

Telugu Lo Computer
0


మణిపూర్ లోని తౌబాల్ జిల్లా యైరిపోక్‌లోని ఏసీఎం హైయ్యర్ సెకండరీ పాఠశాలలో శనివారం 12వ తరగతి మణిపురి లాంగ్వేజ్ బోర్డు పరీక్ష జరిగింది. పరీక్షా కేంద్రాన్ని ఎంసీఎం పాఠశాలలో ఏర్పాటు చేశారు. మొత్తం 405 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో కొందరు తమకు పరీక్ష రాయడానికి మరికొంత సమయం కావాలని ఇన్విజిలేటరను కోరాగా ఆయన అందుకు నిరాకరించారు. నిర్ణీత సమయం ప్రకారం వార్నింగ్ బెల్ మోగింది. ఆ తర్వాత పరీక్షా సమయం మరో ఐదు నిమిషాల్లో ముగుస్తుందనగా విద్యార్థులంతా ఏకమై ఇన్విజిలేటర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పరీక్షా హాలును ధ్వంసం చేశారు. పాఠశాలలోని ఫర్నిచర్, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. ఈ క్రమలో ఓ టీచర్‌తో సహా 15 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధ్యులైన ఎనిమిది మంది విద్యార్థులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)