కొత్తిమీర - ఆరోగ్య ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


కొత్తిమీర వంటకాల రుచిని పెంచడంలో  ప్రముఖ పాత్ర పోషిస్తుంది. రుచిని పెంచడంలోనే కాక మన ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా ఎంతగానో సహాయపడుతుంది. కొత్తిమీరను తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలగడమే కాక కొన్ని రకాల సమస్యలను నియంత్రించవచ్చు. అందుకు కొత్తిమీరలో పుష్కలంగా ఉండే విటమిన్లు, ఖనిజాలే కారణం. అంతేకాకుండా దీనిలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. కొత్తిమీరను వంటకాల్లోనే కాకుండా ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. కొత్తిమీర మొక్క కాండంలోనూ, ఆకుల్లోనూ, గింజల్లోనూ ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో విటమిన్లతోపాటు కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి మూలకాలు ఉంటాయి. ఈ పోషకాలు మన శరీరాన్ని ఫిట్‌గా ఉంచడంతో పాటు మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. తద్వారా సీజనల్ వ్యాధుల నుంచి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కాలేయ సంబంధిత సమస్యలకు కొత్తిమీర చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కొత్తిమీర ఆకులలో తగినంత ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి పిత్త రుగ్మతలు, కామెర్లు వంటి కాలేయ వ్యాధులను నయం చేయడంలో సహాయపడతాయి. జీర్ణవ్యవస్థలో ఆటంకాలు, ప్రేగు సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల సెల్యులార్ డ్యామేజ్‌ను నివారిస్తాయి. కొత్తిమీరను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా సీజనల్ వ్యాధులతో పాటు అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. కొత్తిమీర తీసుకోవడం వల్ల శరీరంలోని అనవసరమైన సోడియం మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. దీంతో ఇది చెడు కొలెస్ట్రాల్, రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఆహారంలో కొత్తిమీరను ఉపయోగించడం వల్ల రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. మధుమేహంతో బాధపడేవారి సమస్యలను ఇది కంట్రోల్‌ చేస్తుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)