పాకీజాకు నాగబాబు ఆర్ధిక సాయం

Telugu Lo Computer
0


ఒకప్పుడు ఆమె బిజీ ఆర్టిస్ట్. ఆమె డేట్స్ కూడా దొరికేవి కావట.. అంత బిజీగా గడిపిన పాకీజా (వాసుకి) ఇప్పుడు ఛాన్స్ లు లేక ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆమె కామెడీ ప్రధాన పాత్రలు చేసి పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె దీన పరిస్థితి గురించి తెలిపారు. పాకీజా పరిస్థితి తెలుసుకున్న నాగబాబు ఆమెకు ఆర్ధికంగా సహాయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాకీజాగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న ఆర్టిస్టు ఇప్పుడు ఇలా కష్టాల్లో ఉండటం చూస్తే బాధగా ఉంది అన్నారు. బుల్లితెర కానీ, సినిమా కానీ చిన్నదో పెద్దదో ఒక పాత్ర ఆవిడకు ఇచ్చి మళ్లీ తన కాళ్ల మీద తాను నిలబడేందుకు పరిశ్రమ వారు సాయపడాలి. నేను కూడా నావంతు ప్రయత్నం చేస్తాను'' అన్నారు. అలాగే ఆమెకు లక్షరూపాయల ఆర్ధిక సాయం అందించారు. నాగబాబు సాయం అందించారని తెలుసుకొని పాకీజా సంతోషం వ్యక్తం చేశారు. ఆయన ఎదురుగా ఉంటే కాళ్లు మొక్కుతా అని అన్నారు. తమిళనాడులో నన్ను పట్టించుకోలేదు.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు నేను ఒక ముద్ద తింటున్నాను అంటే అది తెలుగువాళ్లు వల్లే అంటూ పాకీజా ఎమోషనల్ అయ్యారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)