జన్యులోపం వల్లే గుండెపోటు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 7 January 2023

జన్యులోపం వల్లే గుండెపోటు !


దాదాపు మూడు మిలియన్ సంవత్సరాల క్రితం ఆనాటి మన పూర్వీకుల్లో ఏకైక జన్యువు లోపించడమే తరతరాలుగా గుండెపోటుకు, గుండె జబ్బులకు దారి తీస్తోందని అమెరికా లోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్‌డిగో స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు వెల్లడించారు. ఆ జన్యులోపం కారణం గానే జంతు మాంసం తిన్నవారికి ఈనాడు అనారోగ్య పరిస్థితులు వెంటాడుతున్నాయని  చెప్పారు. గుండెకు సంబంధించిన ధమనుల్లో కొవ్వు పదార్ధాలు పేరుకుని పోవడంతో వచ్చే జబ్బును అథెరోస్కిరోసిస్ అని అంటారు. ప్రపంచం మొత్తం మీద వచ్చే గుండెజబ్బుల రోగుల్లో మూడోవంతు మరణాలకు ఇదే కారణంగా పరిశోధనల్లో వెల్లడైంది. ఇది కాక, బ్లడ్ కొలెస్టరల్ , మాంద్యం, చురుకుదనం లోపించడం, వయోభారం, రక్తపోటు, ఊబకాయం, పొగతాగడం ఇవన్నీ కూడా గుండెజబ్బులకు కారణమవుతున్నాయి. గుండెజబ్బులకు సంబంధించిన సంఘటనలు అథెరోస్క్లిరోసిస్ వల్లనే 15 శాతం వరకు ఉంటున్నాయని పరిశోధకులు వివరించారు. మానవుల్లో ఇది సహజంగా కనిపించినా, చింపాంజీ వంటి మానవ లక్షణాలతో సంబంధం ఉన్న క్షీరదాల్లో ఇటువంటి వ్యాధి లక్షణాలు కనిపించవని దశాబ్దం క్రితం వరకు అనుకునేవారు. కానీ చింపాంజీల్లో గుండె కండరాలు దెబ్బతినడం వల్ల అథెరోస్కిరోసిస్ వస్తోందని అధ్యయనంలో తేలింది. అయితే ఇప్పుడు చేపట్టిన పరిశోధనల్లో జన్యులోపం వల్లనే ఇది సంక్రమిస్తుందని నిరూపించడానికి ఎలుకలో జన్యులోపం ఉండేలా ప్రయోగాలు చేశారు. అంటే నెయు 5 జిసి అనే సియాలిక్ యాసిడ్ సుగర్ మోలిక్యూల్ లోపంతో ఉన్న ఎలుకగా మార్పు చేశారు. దాంతో అథెరోజెనెసిస్ పెరిగేలా చూశారు. ఫలితంగా సిఎంఎహెచ్ అనే జన్యువును ఎలుక తిరిగి పొంద గలిగి నెయుజిసిని ఉత్పత్తి చేయగలిగింది. సిఎఎహ్‌చ్ జన్యువును నిర్వీర్యం చేసేలా వచ్చే మార్పు కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం హొమినిన్ పూర్వీకుల్లో జరగడం వల్లనే మలేరియా పరాన్న జీవితో సంబంధం ఏర్పడిందని , ఆ పరాన్న జీవి నెయు 5 జిసిని తిరిగి పునరుద్ధరించుకోగలిగిందని పరిశోధకులు వివరించారు. మనుషుల్లో మాదిరిగా సిఎంఎహెచ్ , నెయు 5 జిసి ఎలుకలో నిర్మూలించడం వల్లనే అథెరోస్లిరోసిస్ తీవ్రత రెండింతలు పెరిగిందని పరిశోధకులు నిరూపించారు.

No comments:

Post a Comment