కేరళలో తాళపత్ర మ్యూజియం ప్రారంభం !

Telugu Lo Computer
0

కేరళ రాజధానిలో ఇటీవలే తాళపత్ర మ్యూజియం ప్రారంభమైంది. ఇది రాష్ట్ర సాంస్కృతిక, విద్యారంగాన్ని మరింత మెరుగు పరుస్తుంది. ప్రపంచంలో ఈ తరహాలో ప్రారంభమైన మొదటి మ్యూజియం ఇది. ఒకప్పుడు పుస్తకాలు, పెన్నులు లేవు. గ్రంథాలన్ని తాటాకుల మీదే రాసేవారు. ఇలాంటివి ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయాయి. ఒక్కోసారి తవ్వకాల్లో వీటిని భద్రపరుస్తుంటారు. ఈ మ్యూజియంలో అధిక భాగం కొచ్చి భూభాగంలో దొరికినవే. 19వ శతాబ్దం చివరి వరకు అంటే 650 సంవత్సరాల కాలానికి చెందిన ట్రావెన్ కోర్ పరిపాలనా, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక అంశాలతో ఆసక్తికరంగా ఉంటుంది. మ్యూజియం హౌస్.. ప్రఖ్యాతి గాంచిన కొలెచల్ యుద్దానికి సంబంధించిన వ్రాతపత్రులలో, ట్రావెన్ కోర్ రాజు అనిజం తిరునాళ్ మార్తాండ వర్మ (1729-59) గురించి ఉన్నాయి. ఈయన ప్రస్తుత తమిళనాడులోని కన్యాకుమారికి వాయువ్యంగా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొలెచెల్లో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఓడించాడు. ఈయన హయంలోనే డచ్ విస్తరణ ముగిసింది. ఆర్కైవల్ మెటీరియల్ మొదటి దశలో.. రాష్ట్రవ్యాప్తంగా 1.5 కోట్ల తాళ పత్రాలను తీసుకున్నారు. అందులో నుంచి జల్లెడ పట్టి ఎంపిక చేసిన వాటిని ఈ మ్యూజియంలో ఉంచారు. కేవలం మాన్యుస్క్రిప్ట్ తో ఈ మ్యూజియాన్ని నింపాలనుకున్నారు. అయితే కేవలం తాళ పత్రాలే కాకుండా వెదురు చీలికలు, రాగి పలకలు కూడా ఈ మ్యూజియంలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సెంట్రల్ ఆర్కైవ్స్ గా పని చేస్తున్న మూడు శతాబ్దాల నాటి కాంప్లెక్స్ లోని గ్రౌండ్ ఫ్లోర్ లో మ్యూజియం ఏర్పాటు చేశారు. ఎనిమిది గ్యాలరీలతో వీడియోలు, క్యూఆర్ కోడ్ సిస్టమ్ లను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఎనిమిది గ్యాలరీలో అనేక విభాగాలున్నాయి. అవి.. హిస్టరీ ఆఫ్ రైటింగ్, ల్యాండ్ అండ్ పీపుల్, అడ్మినిస్ట్రేషన్, వార్ అండ్ పీస్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, ఎకానమీ, ఆర్ట్ అండ్ కల్చర్, మతిలకం రికార్డులు. ఇక్కడ ఉన్న మ్యూజియం మొత్తం మాన్యుస్క్రిప్ట్ సేకరణను అన్వేషించడానికి కొత్త జీవితాన్ని ఇస్తుందని, మరింత మంది పరిశోధకులు, విద్యార్థులను ఆకర్షిస్తుందని భావిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)