వడ్డీ రేట్లను పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ !

Telugu Lo Computer
0


బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొత్త ఏడాదిలో వడ్డీ రేట్లు [పెంచుతూ రుణ గ్రహీతలకు షాకిచ్చింది. నెలవారీ ఈఎంఐ  పైపైకి కదిలే అవకాశం ఉంది. అలాగే కొత్తగా లోన్ తీసుకునే వారిపై కూడా ఎఫెక్ట్ పడనుంది. అధిక వడ్డీ రేటుతో రుణాలు పొందాల్సి వస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాజాగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు రేటును పెంచేసింది. 2023 జనవరి 7 నుంచే ఇవి అమలులోకి వస్తాయని బ్యాంక్ తెలిపింది. ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ 8.5 శాతానికి చేరింది. ఇదివరకు ఈ రేటు 8.3 శాతంగా ఉండేది. అంటే ఈ ఎంసీఎల్ఆర్ రేటు 20 బేసిస్ పాయింట్లు పెరిగిందని చెప్పుకోవచ్చు. నెల రోజుల ఎంసీఎల్ఆర్ రేటు 8.55 శాతంగా ఉంది. ఇది వరకు ఈ రేటు 8.3 శాతంగా ఉంది. అంటే 25 బేసిస్ పాయింట్ల పైకి కదిలింది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ రేటు 8.35 శాతం నుంచి 8.6 శాతానికి పెరిగింది. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ అయితే 8.45 శాతం నుంచి 8.7 శాతానికి చేరింది. ఇక ఏడాది ఎంసీఎల్ఆర్ 8.85 శాతానికి పెరిగింది. ఇది వరకు ఇది 8.6 శాతంగా ఉంది. రెండేళ్ల ఎంసీఎల్ఆర్ రేటు 8.7 శాతం నుంచి 8.95 శాతానికి చేరింది. మూడేళ్ల ఎంసీఎల్ఆర్ రేటు 8.8 శాతం నుంచి 9.05 శాతానికి పెరిగింది. బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేటును 25 బేసిస్ పాయింట్ల వరకు పెంచిందని చెప్పుకోవచ్చు. దీని వల్ల హోమ్ లోన్, ఆటో లోన్, పర్సనల్ లోన్ , ఇతర రుణాలు అన్నీ కూడా ప్రియం కానున్నాయి. కాగా ఇప్పటికే చాలా బ్యాంకులు ఎంసీఎల్ఆర్ రేటును పెంచేశాయి. ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పీఎన్‌బీ, కెనరా బ్యాంక్ వంటివి రుణ రేట్లు పెంచాయి. ఆర్బీఐ రెపో రేటు పెంపు నేపథ్యంలో బ్యాంకులు కూడా ఇదే దారిలో నడుస్తున్నాయి. రుణ రేట్లు పెంచేస్తున్నాయి. కాగా బ్యాంకులు ఏడాది ఎంసీఎల్ఆర్ రేటును రుణాలకు ప్రామాణికంగా తీసుకుంటాయి. దీనికి రిస్క్ ప్రీమియం, మార్జిన్ వంటివి జత చేసి రుణ రేట్లను నిర్ణయిస్తాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)