ఎన్నికలు ఎప్పడొచ్చినా బీజేపీ సిద్ధం ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 9 January 2023

ఎన్నికలు ఎప్పడొచ్చినా బీజేపీ సిద్ధం !


తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడు రాబోతున్నారని, ఆ పదవి నుంచి బండి సంజయ్‌ను మార్చుతారని సాగుతున్న ప్రచారంపై విజయ శాంతి స్పందించారు. తెలంగాణ ఎన్నికలు ఎప్పడొచ్చినా రాష్ట్ర బీజేపీ సిద్ధమని, పార్టీ అధ్యక్ష పదవిలో ఎలాంటి మార్పులు ఉండబోవని ఖరాఖండిగా విజయశాంతి చెప్పారు. 'టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్‌లో ఎదుర్కొంటున్న పరిణామాలపై సోషల్ మీడియాలో నా స్పందన చూసి, బీజేపీలోనూ రాష్ట్ర నాయకత్వ మార్పు అని అసంబద్ధ ఊహాగానాలు కొందరు బీజేపీ వ్యతిరేకులు లేవనెత్తుతున్నార'ని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక 'రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ సిద్ధం. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై జరుగుతున్న ప్రచారంపై రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్, తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి సైతం స్పష్టతనిచ్చార'ని విజయశాంతి తెలిపారు. 'తెలంగాణ బీజేపీ నాయకత్వంలో ఎటువంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. అంతేకాక అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రస్తుత టీంతో , బండి సంజయ్ నేతృత్వంలోనే యుద్ధానికి సిద్ధమ'ని విజయ శాంతి తేల్చి చెప్పారు. 'అరకొర సమాచారాన్ని నమ్మి చిలవలు పలవలు చేసి ప్రచారం చేసేవారికి ఇంతకు మించి చెప్పాల్సిందేమీ లేదు.రేపటి విజయం బీజేపీది, ఫలితం తెలంగాణ ప్రజలందరిది.. జై శ్రీరాం' అంటూ వ్యాఖ్యానించారు తెలంగాణ బీజేపీ నాయకురాలు విజయశాంతి. రెండు రోజుల క్రితం జరిగిన బండి సంజయ్ అరెస్ట్‌పై కూడా విజయ శాంతి అప్పుడే స్పందించారు. 'అన్యాయానికి గురైన రైతన్నలకు అండగా నిలిచేందుకు వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ని సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. ధర్మ పోరాటం చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై దుర్మార్గ దమనకాండకు పాల్పడ్డ ప్రతిసారీ కేసీఆర్ నియంతృత్వ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతికూల ఫలితాలు వచ్చి తీరతాయన్నది చరిత్ర తిరిగి చెబుతున్న సత్యం. అయినా మారకపోవడం బీఆరెస్ ఖర్మం'అని ఆగ్రహించారు విజయశాంతి.

No comments:

Post a Comment