జాతీయ యువజనోత్సవాల లోగో ఆవిష్కరణ

Telugu Lo Computer
0


కర్ణాటకలోని హుబ్బళ్ళి ధారవాడ జంటనగరాలలో ఈనెల 12 నుంచి జరిగే జాతీయ యువజనోత్సవాల లోగోను సీఎం బసవరాజ్‌ బొమ్మై లాంఛనంగా ఆవిష్కరించారు. సీఎం అధికారిక నివాసం కృష్ణలో మస్కట్‌, లోగోలను ఆవిష్కరించారు. క్రీడలు, యువజనుల శాఖా మంత్రి డాక్టర్‌ నారాయణగౌడ పాల్గొన్నారు. కేంద్ర యువజనులు, క్రీడా శాఖా మంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌ వర్చువల్‌ రూపంలో భాగస్వామ్యులయ్యారు. ఇదే సందర్భంలోనే కేంద్రమంత్రి పర్యవేక్షణలో స్టీరింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. యువజనోత్సవాలు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఏటా యువజనోత్సవాలు జరపడం ఆనవాయితీగా వస్తోంది. హుబ్బళ్ళిలో 26వ జాతీయ యువజనోత్సవాలు సాగునుండగా దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి 7500 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. ఏడాదికో రాష్ట్రంలో జరుపడం ఆనవాయితీగా వస్తోంది. గత ఏడాది పుదుచ్చేరిలో సాగగా ప్రస్తుతం కర్ణాటకలో కొనసాగనున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)