వేడి వేడి నూడుల్స్ తిందామని చలిలో బయటికొచ్చాడు...!

Telugu Lo Computer
0


కెనడాకు చెందిన జేక్ ఫిషర్ అనే వ్యక్తి, అక్కడి చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తూ నూడుల్స్ తినాలని అనుకున్నాడు. ఇంట్లో వేడి వేడిగా నూడుల్స్ సిద్ధం చేసుకొని, స్వెటర్ ధరించి ఆరుబయట కాలుమోపాడు. ఇక పొగలు కక్కుతున్న ఆ నూడుల్స్‌ని తినేందుకు స్పూన్ పెట్టి పైకెత్తాడు. అంతే అది గాల్లోనే గడ్డకట్టుకుపోయింది. కనురెప్పపాటులోనే స్పూన్‌తో పాటు నూడుల్స్ కూడా కదలకుండా, గాల్లో అలాగే ఉండిపోయాయి. కేవలం ఆ నూడుల్సే కాదు, జేక్ జుట్టు, గడ్డం కూడా గడ్డకట్టుకుపోయాయి. ఈ పరిణామంతో ఖంగుతిన్న జేక్.. దీన్నంతా తన కెమెరాలో బంధించాడు. వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. డిసెంబర్ 28వ తేదీన ఈ వీడియోని అతడు పోస్ట్ చేయగా.. అది వైరల్ అయ్యింది. ఈ వీడియోపై నెటిజన్లు సైతం కామెడీ కామెంట్లు చేస్తున్నారు. 'అంత మంచు కురుస్తుందని తెలిసి, ఎవరు నిన్ను బయటికి వెళ్లమన్నాడు' అంటూ ఒక నెటిజన్లు సెటైరికల్‌గా కామెంట్ చేశాడు. మరొకరైతే, గడ్డకట్టిన ఆ వ్యక్తి 'అక్వామ్యాన్'లాగా ఉన్నాడని పేర్కొన్నాడు. ఇంకొకరైతే ఈ జేక్ నార్నియా ప్రాంతం నుంచి వచ్చాడంటూ కామెంట్ పెట్టాడు. నూడుల్స్ తినాలనుకున్న వ్యక్తే నూడుల్స్‌లా మారాడంటూ మరికొందరు సరదా కామెంట్లు చేసుకుంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)