కొరియోగ్రాఫర్ సుచిత్ర చంద్రబోస్ తండ్రి మృతి

Telugu Lo Computer
0


కొరియోగ్రాఫర్ సుచిత్ర చంద్రబోస్ తండ్రి, చంద్రబోస్‌ మామగారు చాంద్ బాషా (92) శుక్రవారం రాత్రి హైదరాబాద్ మణికొండలో మృతి చెందారు. చాంద్ బాషా దక్షిణాదిలో అనేక సినిమాలకు సంగీత దర్శకునిగా పనిచేశారు. చాంద్ బాషా కి ముగ్గురు కూతుర్లు,ఒక కొడుకు ఉన్నారు. తెలుగులో ఖడ్గ తిక్కన్న, బంగారు సంకెళ్లు, స్నేహమేరా జీవితం, మానవుడే దేవుడు కన్నడంలో అమర భారతి, చేడిన కిడి కన్నడ వంటి అనేక చిత్రాలకు సంగీతాన్ని అందించారు.చాంద్ బాషా మృతితో సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)