బీహార్‌లో నేటి నుంచి కుల గణన !

Telugu Lo Computer
0


బీహార్‌లో నేటి నుండి కులాల ఆధారిత సర్వే మొదటి దశ ప్రారంభం కానుంది. ఈ నెల 21వరకుఈ దశ కొనసాగుతుంది. మొదటి దశలో రాష్ట్రంలోని మొత్తం కుటుంబాల సంఖ్య లెక్కించి, నమోదు చేస్తారు. రెండో దశలో కుటుంబాల్లో నివసించే వ్యక్తులు, వారి కులాలు, ఉప కులాలు, సామాజిక, ఆర్థిక పరిస్థితులు వంటి సమాచారాన్ని సేకరిస్తారు. ఏప్రిల్‌ 1 నుండి 30వరకు రెండో దశ కొనసాగుతుంది. మొత్తంగా సర్వే మే 31తో ముగుస్తుంది. ప్రస్తుతం కొనసాగుతున్న తన సమాధాన్‌ యాత్రలో భాగంగా శుక్రవారం మీడియాతో ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ మాట్లాడుతూ, ఈ సర్వేతో రాష్ట్రంలో కులాలు, కమ్యూనిటీలపై సవివరమైన రికార్డు వుంటుందని చెప్పారు. వారి అభివృద్ధికి ఇది సహాయపడుతుంద న్నారు. రాష్ట్రంలో కులాల వారీగా సర్వే జరగాలను అఖిల పక్షం డిమాండ్‌ను గతేడాది జూన్‌ 2న రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)