బైక్‌పై ఎక్కలేదని హెల్మెట్ తో దాడి - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 7 January 2023

బైక్‌పై ఎక్కలేదని హెల్మెట్ తో దాడి


హర్యానాలో ఓ వ్యక్తి తన బైక్‌పై వెళ్లేందుకు నిరాకరించిన మహిళను హెల్మెట్‌తో కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సీసీ కెమెరాలో రికార్డు కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే తనతో పాటు బైక్‌పై రమ్మని కమల్ అనే వ్యక్తి రోడ్డుపై వెళ్తున్న యువతిని బలవంతం చేశాడు. ఈ క్రమంలో అతనితో వెళ్లేందుకు నిరాకరించిన ఆ మహిళను కమల్ తన చేతిలో ఉన్న హెల్మెట్ తో తీవ్రంగా గాయపర్చాడని గురుగ్రామ్ ఏసీపీ మనోజ్ తెలిపారు. ఈ సమయంలో అటు వైపుగా ఆటోలో వచ్చిన ఓ వ్యక్తి తన వాహనాన్ని ఆపి, ఆమెను రక్షించాడు. అదే సమయంలో మహిళ తన హ్యాండ్‌బ్యాగ్‌తో కమల్ అనే వ్యక్తిపై దాడి చేసి, విడిపించుకుంది. ఈ ఘటన జరుగుతుండగానే అక్కడికి చేరుకున్న మరికొంత మంది వ్యక్తులు కమల్‌ నుంచి మహిళను దూరంగా నెట్టివేశారు. అనంతరం సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఏసీపీ మనోజ్‌ తెలిపారు.

No comments:

Post a Comment