పంజాబ్‌ మంత్రి రాజీనామా !

Telugu Lo Computer
0


పంజాబ్‌ ఆప్‌ ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు కారణంగా ఉద్యానవన శాఖ మంత్రిగా ఉన్న ఫౌజా సింగ్‌ సరారి తన పదవికి రాజీనామా చేశారు.  కాంట్రాక్టుల విషయంలో డబ్బుతీసుకోవడం గురించి మంత్రి తన సన్నిహితుడితో మాట్లాడుతున్న ఆడియో క్లిప్‌ ఒకటి వెలుగులోకి వచ్చింది. నాలుగు నెలల క్రితం ఇది బయటకు వచ్చింది. ఈ ఆడియో వివాదాస్పదం కావడంతో ముఖ్యమంత్రి భగవంత్‌మాన్‌కు శనివారం ఫౌజా రాజీనామా సమర్పించారు. వ్యక్తిగత కారణాల వల్లే బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ రాజీనామాను మాన్‌ ఆమోదించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఆ ఆడియోలో ఉన్నది తన మాటలు కాదని, ఇదంతా కుట్రపూరితమంటూ ఫౌజా తనపై వచ్చిన విమర్శలను తోసిపుచ్చారు. అలాగే పార్టీలోనే కొనసాగుతానని వెల్లడించారు. ఆప్‌ ప్రభుత్వం ఏర్పడి సుమారు పది నెలలు కావొస్తుంది. ఇలా అవినీతి ఆరోపణలతో మంత్రి పదవిని పోగొట్టుకున్నవారిలో ఫౌజా రెండో వ్యక్తి. అంతకుముందు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రిగా ఉన్న విజయ్ సింగ్లాను మాన్‌ మంత్రివర్గం నుంచి తొలగించారు. మంత్రిపై ఆరోపణలు రావడం, అందుకు సంబంధించి బలమైన సాక్ష్యాధారాలు కూడా లభించడంతో సీఎం ఆ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా సింగ్లాపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ వెంటనే మంత్రిని అరెస్టు చేసింది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండు నెలలకే అవినీతి ఆరోపణలపై మంత్రి సింగ్లా అరెస్టు అయ్యారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)