పాకిస్థాన్‌ను ఇండియాతో పోల్చవద్దు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 17 December 2022

పాకిస్థాన్‌ను ఇండియాతో పోల్చవద్దు !


ముస్లింలు పాకిస్థాన్‌లో కన్నా భారత్‌లోనే బాగా సురక్షితంగా ఉన్నారని అజ్మీర్ షరీఫ్ దర్గా ఆధ్యాతిక పెద్ద, ఆల్ ఇండియా సూఫీ సజ్జదానషీన్ కౌన్సిల్ చైర్మన్ హజ్రత్ సయ్యద్ నశీరుద్దీన్ ఛిస్తీ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీపై పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో విషం కక్కాక ఆయన ఈ విషయం చెప్పారు. " మన గౌరవనీయ ప్రధానిపై, మన దేశంపై బిలావల్ భుట్టో చేసిన వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నాను" అన్నారు. "ఆయన పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ హోదాను తక్కువ చేయడమేకాక, యావత్ పాకిస్థాన్‌ను తక్కువ చేశారు" అని విమర్శించారు. "పాకిస్థానీ ముస్లింల కన్నా భారత ముస్లింలు ఎంతో సురక్షితంగా ఉన్నారన్న విషయాన్ని పాకిస్థాన్ మనస్సులో పెట్టుకోవాలి" అన్నారు. ఆయన ఇంకో విషయం కూడా ఈ సందర్భంగ చెప్పారు. ఉసామా బిన్ లాడెన్ చనిపోలేదు, పాకిస్థాన్‌లో అమెరికన్ల చేత చంపబడ్డాడన్నారు. పాకిస్థాన్‌ను ఇండియాతో పోల్చవద్దని ఆయన బిలావల్ భుట్టోకు ఈ సందర్భంగా సలహా ఇచ్చారు. "ఎన్నడూ ఘనమైన భారత దేశంతో అస్థిరమైన పాకిస్థాన్‌ను పోల్చవద్దు. ఎందుకంటే భారత రాజ్యాంగం మత స్వేచ్ఛకు హామీనిచ్చింది" అని చెప్పుకొచ్చారు. దీనికి ముందు ఈ వారం మొదట్లో కొంత మంది పాకిస్థాన్ పత్రికా విలేకరులు భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సాహిస్తోంది అని అన్నప్పుడు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ "మీరు అడగకూడని మంత్రిని ఈ ప్రశ్న అడుగుతున్నారు. మేమెంత కాలం ఇట్లా చేస్తామని మీరడుగుతున్నారు. కానీ మీరు ఈ ప్రశ్నను మీ పాకిస్థాన్ మంత్రులను అడగాలి. ఎన్నాళ్లు పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని అనుసరిస్తుంది? అని మీరు వారినడగాలి" అని జవాబిచ్చారు. జైశంకర్ అన్న దానిని వ్యతిరేకిస్తూ బిలాల్ ప్రధాని మోడీపై ధ్వజమెత్తారు. అంతేకాక ఆర్‌ఎస్‌ఎస్‌ను ఎండగట్టారు.

No comments:

Post a Comment