యాసిడ్ దాడి బాధితురాలికి రూ.35 లక్షలు చెల్లించండి !

Telugu Lo Computer
0


ఉత్తరాఖండ్ లోని యూఎస్ నగర్ జిల్లాకు చెందిన  యువతిపై 2014లో ఓ ప్రేమోన్మాది యాసిడ్ దాడి చేశాడు. అప్పడు ఆమె 12వ తరగతి చదువుతోంది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ చెవి పూర్తిగా కాలిపోయింది. మరో చెవి 50 శాతం దెబ్బతింది. మొహం కూడా కాలిపోయింది. అయితే ప్రభుత్వం ఈమెకు సరైన పరిహారం అందించలేదు. బాధితురాలు పూర్తిగా కోలుకునే వరకు వైద్య ఖర్చులు ఎంతైనా, దేశంలో ఎక్కడ చికిత్స అందించినా ప్రభుత్వమే భరించాలని 2017లోనే కోర్టు ఆదేశించింది. కానీ ఈమెకు పరిహారం కూడా అందించాలని 2019లో ఓ న్యాయవాది పిటిషన్ దాఖలు చేసింది. యువతికి ప్రభుత్వం భద్రత కల్పించలేకపోయిందని, సాయం అందించాలని కోరింది. రాజకీయాల కోసం కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం యాసిడ్ దాడి బాధితురాలికి రూ.లక్షలు సాయంగా సమకూర్చలేదా? అని పిటిషన్‌లో పేర్కొంది. వాదనలు విన్న ఉత్తరాఖండ్ హైకోర్టు యాసిడ్ దాడి బాధితురాలికి ప్రభుత్వం రూ.35 లక్షలు సాయంగా అందించాలని చెప్పింది. ఆమెకు అయిన వైద్య ఖర్చులతో దీనికి సంబంధం లేదని స్పష్టం చేసింది. దేశంలో యాసిడ్ దాడులకు గురవుతున్న ఇతర మహిళలకు కూడా ఇదే విధంగా పరిహారం అందించాలని బాధితురాలి తరఫు న్యాయవాది స్నిగ్ధ తివారి డిమాండ్ చేశారు

Post a Comment

0Comments

Post a Comment (0)