గులాబీ రేకులు, బిర్యానీ, తులసి ఆకులతో టీ !

Telugu Lo Computer
0


రాజస్థాన్‌కు చెందిన జ్యోతి జంగీద్‌, ఢిల్లీలో మాస్టర్స్‌ చదువుతూ ఏదైనా బిజినెస్‌ చేయాలని అనుకుంది. బాగా ఆలోచించి టీ స్టాల్‌ పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ముఖర్జీనగర్‌లో 'జేజే తాడి' పేరుతో టీ స్టాల్‌ ప్రారంభించింది. జేజే అంటే జ్యోతి జంగీద్‌ అని, తాడి అంటే తమ భాషలో కూర్చునే చోటని ఆమె చెబుతోంది. చాయ్‌ తయారీలో ఎవరైనా పాలు, నీరు, టీ పొడి, చక్కెర, యాలకులు వినియోగిస్తారు. కానీ ఈ టీ స్టాల్‌లో మాత్రం గులాబీ రేకులు, బిర్యానీ ఆకులు, తులసి ఆకులను వాడుతున్నారు. వీటితో తయారు చేసిన టీ రుచిగా ఉండటం వల్ల చాయ్‌ తాగడానికి ప్రజలు తరలివస్తున్నారు. ''నా షాప్‌లో తయారుచేస్తున్న తేనీరులో సహజసిద్ధ పదార్థాలను ఉపయోగిస్తున్నాను. రోజూ చాలా మంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి టీ తాగుతున్నారు. కొందరు రోజుకు 5 సార్లు టీ తాగుతున్నారు. కెమికల్స్‌ ఉన్న పదార్థాలు టీ తయారీలో వాడట్లేదు కనుక రోజుకు ఎన్నిసార్లు తాగినా ఆరోగ్యానికి హాని కలగదు'' అని జ్యోతి చెబుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)